గిరిజనుల ఇంటికే నిత్యావసర సరుకులు

ABN , First Publish Date - 2020-04-09T12:12:07+05:30 IST

రహదారి సౌకర్యం లేని మారుమూల గ్రామాల్లో వలంటీర్ల ద్వారా గిరిజనుల ఇంటికే నిత్యావసర సరుకులు అందజేయనున్నట్లు ఐటీడీఏ

గిరిజనుల ఇంటికే నిత్యావసర సరుకులు

కొమరాడ, ఏప్రిల్‌ 8 : రహదారి సౌకర్యం లేని మారుమూల గ్రామాల్లో వలంటీర్ల ద్వారా గిరిజనుల ఇంటికే నిత్యావసర సరుకులు అందజేయనున్నట్లు ఐటీడీఏ పీవో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ చెప్పారు. కూనేరు, పూడేసు తదితర గిరిజన గ్రామాల్లో బుధవారం ఆయన పర్యటించారు. లాక్‌డౌన్‌ కారణంగా ప్రభుత్వం అందజేస్తున్న బియ్యం, రూ.వెయ్యి ఆర్థిక సాయం అందుతుందా? లేదా? అన్న దానిపై ఆరా తీశారు.


అంగన్‌వాడీల ద్వారా అందిస్తున్న పౌష్టికా హారం సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. ముఖ్యంగా గర్భిణులు ప్రసవాల సమయానికి వారం రోజులు ముందుగానే దగ్గరలో ఉన్న ప్రభుత్వ వైద్యశాలలో చేరాలన్నారు.  కూనేరు నుంచి యండభద్ర రహదారి మరమ్మతుల కు నిధులు మంజూరయ్యాయని, లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తరువాత టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని తెలిపారు.   

Updated Date - 2020-04-09T12:12:07+05:30 IST