జుట్టుకు ఎసెన్షియల్‌ ఆయిల్స్‌

ABN , First Publish Date - 2021-01-04T05:30:00+05:30 IST

జుట్టు వేగంగా పెరగడానికి సహాయపడే గుణాలు లావెండర్‌ ఎసెన్షియల్‌ ఆయిల్‌లో ఉన్నాయి. బ్యాక్టీరియాను నశింపచేసే గుణాలు కూడా ఇందులో ఉన్నాయి.

జుట్టుకు ఎసెన్షియల్‌ ఆయిల్స్‌

ఎసెన్షియల్‌ ఆయిల్స్‌  వెంట్రుకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. అవేమిటంటే..


  1.  జుట్టు వేగంగా పెరగడానికి సహాయపడే గుణాలు లావెండర్‌ ఎసెన్షియల్‌ ఆయిల్‌లో ఉన్నాయి. బ్యాక్టీరియాను నశింపచేసే గుణాలు కూడా ఇందులో ఉన్నాయి.
  2.  వెంట్రుకలు పెరిగే దశలో  పిప్పర్‌మెంట్‌ ఎసెన్షియల్‌ ఆయిల్‌ బాగా పనిచేస్తుంది.
  3.  కురులు ఒత్తుగా ఉండడంతో పాటు అవి బాగా పెరిగేలా చేస్తుంది రోజ్‌మేరీ ఎసెన్షియల్‌ ఆయిల్‌ 
  4.  సెడార్‌వుడ్‌ ఎసెన్షియల్‌ ఆయిల్‌   జుట్టు రాలడాన్ని నిరోధిస్తుంది. ఇందులోని యాంటీ ఫంగల్‌, యాంటీ బ్యాక్టీరియల్‌  గుణాలు కురులు ఆరోగ్యంగా పెరిగేలా చేస్తాయి.
  5.  లెమన్‌గ్రాస్‌ ఎసెన్షియల్‌ ఆయిల్‌ చుండ్రును నివారించడంలో ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది.
  6.  థైమే ఎసెన్షియల్‌ ఆయిల్‌ కూడా జుట్టు రాలిపోవడాన్ని తగ్గిస్తుంది.
  7.  క్లారీ సేజ్‌ ఆయిల్‌ వాడడం వల్ల శిరోజాలు బాగా పెరుగుతాయి. వెంట్రుకలు దృఢంగా, పటిష్టంగా మారతాయి.
  8.  టీ ట్రీ ఎసెన్షియల్‌ ఆయిల్‌ మంచి క్లీన్సర్‌. దీన్ని యాంటీ-డాండ్రఫ్‌ చికిత్సలో వాడతారు.
  9.  యాంగ్‌ యాంగ్‌  ఎసెన్షియల్‌ ఆయిల్‌ డ్రై స్కాల్ప్‌ ఉన్న వారికి మంచిది. ఇది పీచులా గరుకుగా ఉన్న వెంట్రుకలను మృదువుగా చేస్తుంది. వెంట్రుకల కొసలు చిట్లిపోకుండా చూస్తుంది.

Updated Date - 2021-01-04T05:30:00+05:30 IST