ఒంటిగంట వరకే నిత్యావసర దుకాణాలు

ABN , First Publish Date - 2020-04-09T11:03:19+05:30 IST

యాదాద్రిభువనగిరి జిల్లాలో గురువారం నుంచి నిత్యావసర, కూరగాయాల దుకాణాలను మధ్యాహ్నం ఒంటిగంట వరకే అనుమతించనున్నట్లు కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ తెలిపారు.

ఒంటిగంట వరకే నిత్యావసర దుకాణాలు

 నేటి నుంచి పకడ్బందీగా లాక్‌డౌన్‌

 యాదాద్రిభువనగిరి జిల్లా కలెక్టర్‌ అనితారామచంద్రన్‌

 బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం నిషేధం 

 నల్లగొండ జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌


యాదాద్రి, ఏప్రిల్‌8(ఆంధ్రజ్యోతి) / నల్లగొండ టౌన్‌ :  యాదాద్రిభువనగిరి జిల్లాలో గురువారం నుంచి నిత్యావసర, కూరగాయాల దుకాణాలను మధ్యాహ్నం ఒంటిగంట వరకే అనుమతించనున్నట్లు కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ తెలిపారు. బుధవారం ఆమె అదనపు కలెక్టర్‌ జి.రమేష్‌, డీసీపీ కె.నారాయణరెడ్డి, ఏసీపీ భుజంగరావు, వర్తకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి లాక్‌డౌన్‌ పక్బడందీ అమలు గురించి చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతు బజార్లు, పాల సరఫరా, మొబైల్‌ దుకాణాలు సైతం విధిగా ఒంటిగంట వరకు మూసివేయాలని ఆదేశించారు. మందుల దుకాణాలు మా త్రం సాయంత్రర 5గంటల వరకు ఉంటాయ ని, అపోలో ఫార్మసీ మాత్రం రోజుకు 24గంట లు పనిచేస్తుందని ప్రకటించారు. బ్యాంకులు మాత్రం ఉదయం 10గంటల నుంచి సాయం త్రం 4గంటల వరకు తెరిచి ఉంటాయన్నారు. జన్‌ధన్‌ ఖాతాదారులు బ్యాంకుల వద్ద పెద్దఎత్తున గుమిగూడకుండా, భౌతిక దూరం పాటించాలని సూచించారు.


జనసామర్థ్యం ఉన్న ప్రదేశాల్లో, ప్రభుత్వ, ప్రైవేటు స్థలాల్లో ఉమ్మివేయడం నిషేధమని నల్లగొండ జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ఈ నిషేధం తక్షణం అమల్లోకి వస్తుందని, ఎవరైన ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేసి ఆరు నెలల జైలు లేదా జరిమానా, లేదా రెండు శిక్షలు విధించనున్నట్లు తెలిపారు. 

Updated Date - 2020-04-09T11:03:19+05:30 IST