కొవ్వూరులో కొవిడ్‌ ఆస్పత్రి ఏర్పాటు చేయండి: మంత్రి పేర్ని నాని

ABN , First Publish Date - 2021-05-18T06:03:31+05:30 IST

కొవ్వూరులో ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లతో 10 పడకల కొవిడ్‌ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రవా ణా శాఖా మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) కలెక్టర్‌ను కోరారు.

కొవ్వూరులో కొవిడ్‌ ఆస్పత్రి ఏర్పాటు చేయండి: మంత్రి పేర్ని నాని

ఏలూరు, మే 17 (ఆంధ్రజ్యోతి): కొవ్వూరులో ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లతో 10 పడకల కొవిడ్‌ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రవా ణా శాఖా మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) కలెక్టర్‌ను కోరారు. మచిలీ పట్నంలోని తన నివాసం నుంచి ఆయన సోమవారం జూమ్‌లో కొవిడ్‌పై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన స్త్రీ, శిశు సంక్షేమ శాఖా మంత్రి తానేటి వనిత 50 పడకల సీహెచ్‌సీ ఆసుపత్రిని కొవిడ్‌ చికిత్సకు వినియోగించాలని మంత్రి నానిని కోరారు. దీనిపై స్పందించిన ఆయన కొవిడ్‌ ఆసుపత్రి నిర్వహణకు సాధ్యాసాధ్యాలను తెలియజేయాలని కలెక్టర్‌ను కోరారు. కొవ్వూరు సీహెచ్‌సీలో ఆక్సిజన్‌ సౌకర్యం లేకపోవడం, డెలివరీ, అత్యవసర వైద్యం అందిస్తున్నామని కలెక్టర్‌ చెప్పారు. దీంతో కొవ్వూరులోని ఒక కల్యాణ మండపం తీసుకుని 10 బెడ్లను కొవిడ్‌ వైద్యానికి కేటాయించి, ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లతో కొవిడ్‌ వైద్యం అందించేందుకు ప్రయత్నిస్తామని ఆయన తెలిపారు. కల్యాణ మండపం ఎంపిక, ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను మంత్రి తానేటి వనిత సమకూరుస్తామని తెలిపారు. సమీక్షలో జేసీలు వెంకట రమణారెడ్డి, హిమాన్షు శుక్లా, ట్రైనీ కలెక్టర్‌ రాహుల్‌ కుమార్‌ రెడ్డి, ఇన్చార్జి డీఆర్‌ఓ ఉదయ భాస్కర్‌, డీసీహెచ్‌ఎస్‌, డీఎంహెచ్‌ఓ పాల్గొన్నారు. 


Updated Date - 2021-05-18T06:03:31+05:30 IST