25 ప్రత్యేక వ్యాక్సిన్‌ కేంద్రాల ఏర్పాటు

ABN , First Publish Date - 2022-01-24T06:04:58+05:30 IST

ప్రస్తుతం కొనసాగుతున్న వ్యాక్సిన్‌ కేంద్రాలతోపాటు మరి కొన్ని ప్రత్యేక వ్యాక్సిన్‌ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ జువైరియా ఒక ప్రకటనలో తెలిపారు.

25 ప్రత్యేక వ్యాక్సిన్‌ కేంద్రాల ఏర్పాటు

సుభాష్‌నగర్‌, జనవరి 23: ప్రస్తుతం కొనసాగుతున్న వ్యాక్సిన్‌ కేంద్రాలతోపాటు మరి కొన్ని ప్రత్యేక వ్యాక్సిన్‌ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ జువైరియా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వ్యాక్సినేషన్‌ సెంటర్లలో 15 నుంచి 18 సంవత్సరాల వయస్సు గల వారికి కొవాగ్జిన్‌ మొదటి డోసు, 19 సంవత్సరాలు ఆపై వయస్సు గల వారికి కొవాగ్జిన్‌, కొవీషీల్డ్‌ రెండో డోసు, రెండో డోసు తీసుకొని 9 నెలలు పూర్తైన  60 సంవత్సరాలు పై వారికి బూస్టర్‌ డోసు ఇస్తారని తెలిపారు. బుట్టి రాజారాం కాలనీ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ పరిధిలో బుట్టి రాజారాం అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌, జిల్లా ఆసుపత్రిలోని వెల్‌నెస్‌ సెంటర్‌, వావిలాల పల్లిలోగల మున్సిపల్‌ పార్కులో వ్యాక్సినేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. కట్టరాంపూర్‌ ఆర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ పరిధిలో డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ స్టేడియం, కలెక్టరేట్‌లో, కట్టరాంపూర్‌ హైస్కూల్‌ (ప్రభుత్వ), భగత్‌నగరలోని అయ్యప్ప ఆలయంలో వ్యాక్సినేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. సప్తగిరి కాలనీ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ పరిధిలో  సప్తగిరి కాలనీ హైస్కూల్‌(ప్రభుత్వ), విద్యానగర్‌ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ పరిధిలో విద్యానగర్‌ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌, ఆర్టీసీ డిస్పెన్సరీ, రాంనగర్‌ ఎస్సీ హాస్టల్‌, జిల్లా గ్రంథాలయంలో ఏర్పాటు చేశామన్నారు. మోతాజ్‌ఖానా అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ పరిధిలో మోతాజ్‌ఖానా అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌తోపాటు బాంబే స్కూల్‌, వైశ్యభవన్‌, సంజీవయ్య మెమోరియల్‌ క్లబ్‌,  టవర్‌సర్కిల్‌, హౌసింగ్‌బోర్డు కాలనీ అర్బన్‌ సెంటర్‌ పరిధిలో హౌసింగ్‌బోర్డు కాలనీ అర్బన్‌ సెంటర్‌తోపాటు కాపువాడలోని ఎస్‌డి ఓల్డేజ్‌ హోం, రిషి కాన్వేంట్‌లో వ్యాక్సిన్‌ వేస్తారని చెప్పారు.


Updated Date - 2022-01-24T06:04:58+05:30 IST