సత్వర సేవలందించేందుకే కమిషనరేట్ల ఏర్పాటు

ABN , First Publish Date - 2022-01-19T05:54:24+05:30 IST

పెట్రోల్‌ పంపులు, ఎక్‌స్పోజివ్‌ షాప్‌లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ఎన్‌వోసీ రిపోర్టుల గురించి సీపీ శ్వేత సమీక్ష సమావేశం నిర్వహించారు.

సత్వర సేవలందించేందుకే కమిషనరేట్ల ఏర్పాటు
సమావేశంలో మాట్లాడుతున్న సీపీ శ్వేత

వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశంలో సీపీ 

సిద్దిపేట క్రైం, జనవరి 18: పెట్రోల్‌ పంపులు,  ఎక్‌స్పోజివ్‌ షాప్‌లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ఎన్‌వోసీ రిపోర్టుల గురించి  సీపీ శ్వేత సమీక్ష సమావేశం నిర్వహించారు. మంగళవారం సాయంత్రం పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో జిల్లా రెవెన్యూ, ఆర్‌బీ, ఎలక్ట్రిసిటీ, పంచాయతీరాజ్‌, మునిసిపాలిటీ, ఫైర్‌ విభాగాల జిల్లా, డివిజన్‌ అధికారులతో నిర్వహించిన సమీక్షలో సీపీ మాట్లాడుతూ.. ప్రజలకు సత్వర సేవలు అందించేందుకే రాష్ట్ర ప్రభుత్వం పోలీసు కమిషనరేట్స్‌ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఈ కమిషనరేట్‌ ద్వారా  పెట్రోల్‌పంపులు, ఎక్‌స్పోజివ్‌ షాప్స్‌, తదితర ఇండస్ట్రీ్‌సకు  అనుమతులు ఇవ్వనున్నట్టు వివరించారు. దరఖాస్తు చేసుకునే వ్యక్తి పూర్తి వివరాలు, సెల్‌ఫోన్‌నెంబర్‌తో సహా అందించాలని సూచించారు. పెట్రోల్‌ పంప్‌, ఎక్‌స్పోజివ్‌ షాప్స్‌ గురించి వివిధ శాఖల జిల్లా, డివిజన్‌ స్థాయి అధికారులు  నెలరోజుల్లోగా సంబంధిత  రిపోర్టులు  పంపించాలని తెలిపారు. అధికారులందరూ సమన్వయంతో అనుమతులకు సంబంధించి పెండింగ్‌ లేకుండా చూడాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్‌వో చెన్నయ్య, అడిషనల్‌ డీసీపీ అడ్మిన్‌ మహేందర్‌, సిద్దిపేట ఏసీపీ దేవారెడ్డి, హుస్నాబాద్‌ ఏసీపీ సతీష్‌, గజ్వేల్‌ ఏసీపీ రమేష్‌, ఆర్‌బీ ఎగ్జిక్యూటీవ్‌ ఇంజనీర్‌ సుదర్శన్‌ రెడ్డి, జిల్లా ఫైర్‌ అధికారి వెంకన్న, సిద్దిపేట మున్సిపల్‌ కమిషనర్‌ రవీందర్‌రెడ్డి, హుస్నాబాద్‌ మున్సిపల్‌ కమిషనర్‌ రాజ మల్లయ్య, చేర్యాల మున్సిపల్‌ కమిషనర్‌ రాజేంద్రకుమార్‌, గజ్వేల్‌ మున్సిపల్‌ కమిషనర్‌ వెంకట గోపాల్‌, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-19T05:54:24+05:30 IST