నిత్యావసర సరుకుల పర్యవేక్షణకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు

ABN , First Publish Date - 2020-03-30T20:31:10+05:30 IST

నిత్యావసర సరుకుల పర్యవేక్షణకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు

నిత్యావసర సరుకుల పర్యవేక్షణకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు

అమరావతి: నిత్యావసర సరుకుల పర్యవేక్షణకు అధికారులు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. జిల్లాల్లో జాయింట్‌ కలెక్టర్ల ఆధ్వర్యంలో కంట్రోల్‌ రూమ్‌లు నిర్వహిస్తారు. అధిక ధరలపై 1902 నెంబర్‌కు ఫిర్యాదు చేయాలని మార్కెటింగ్ కమిషనర్ ప్రద్యుమ్న తెలిపారు. నిత్యావసరాల సరఫరాకు ఇబ్బంది లేకుండా ఈ-పాస్ సిస్టమ్ ప్రవేశపెట్టామని, ఇప్పటికే 101 రైతు బజార్లు.. వివిధ ప్రాంతాల్లో మరో 350 రైతు బజార్లు ఏర్పాటు చేశామన్నారు. 130 మొబైల్ రైతు బజార్లు ఏర్పాటు చేశామని చెప్పారు. కిరాణా సరుకుల డోర్‌ డెలివరీని వినియోగించుకోవాలని ప్రద్యుమ్న సూచించారు.

Updated Date - 2020-03-30T20:31:10+05:30 IST