రైతుల కోసం స్థిరీకరణ నిధి ఏర్పాటు

ABN , First Publish Date - 2020-05-27T10:07:48+05:30 IST

రైతుల సంక్షేమం కోసం రూ.3వేల కోట్ల తో స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం జగన్మోహన్‌రెడ్డి తెలిపారు.

రైతుల కోసం స్థిరీకరణ నిధి ఏర్పాటు

ఒంగోలు(కలెక్టరేట్‌), మే 26 : రైతుల సంక్షేమం కోసం రూ.3వేల కోట్ల తో స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం జగన్మోహన్‌రెడ్డి తెలిపారు. మేథోమదనం సదస్సులో భాగంగా మంగళవారం వ్యవసాయం, అనుబ ంధ రంగాలపై సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించగా ఒంగోలులో జిల్లా మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్‌, జిల్లా కలెక్టర్‌ పోలా భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లా డుతూ రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్నారు. ఈనెల 30న రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాలు ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. మా ర్కాపురానికి చెందిన వెంగళరెడ్డి అనే రైతు సీఎంతో మాట్లాడారు. 


రైతు కంట కన్నీరు రాకుండా చూస్తున్నాం ..

రైతు కంట కన్నీరు రాకుండా ఆనందం వెల్లివిరిసేలా సీఎం జగన్మోహ న్‌రెడ్డి వ్యవసాయరంగాన్ని అబివృద్ధి చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి ఆది మూలపు సురేష్‌ పేర్కొన్నారు. మంగళవారం ఒంగోలులోని స్పందన భవన్‌లో మన పాలన- మీసూచన పేరుతో ఏడాది పాలనపై సదస్సు జ రిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పంటల సాగుకు పెట్టుబ డి నుంచి పంట ఉత్పత్తి, మార్కెట్‌ సౌకర్యం కల్పించే వరకు ప్రభుత్వమే బాధ్యత వహిస్తుందన్నారు.


కలెక్టర్‌ పోలా భాస్కర్‌ మాట్లాడుతూ వ్యవ సాయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు రైతుల సూచనలు తీసుకుం టున్నామని తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే అన్నా రాంబాబు, ఎమ్మెల్సీ పోతుల సునీత, కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌యాదవ్‌, డీసీఎంఎస్‌ చైర్మన్‌ రావి రామనాథం, జేసీలు వెంకటమురళీ, చేతన్‌, నరేంద్రప్రసాద్‌, డీఆర్వో వెంకటసుబ్బయ్య సీపీవో వెంకటేశ్వర్లు, జేడీఏ శ్రీరామమూర్తి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-27T10:07:48+05:30 IST