Abn logo
Mar 2 2021 @ 00:34AM

అక్రమ కట్టడాల నివారణకు బృందాల ఏర్పాటు

 జిల్లా కలెక్టర్‌ గుగులోతు రవి

జగిత్యాల, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): అక్రమ కట్టడాల నివారణకు బృం దాల ఏర్పాటు చేశామని కలెక్టర్‌ గుగులోతు రవి అన్నారు. సోమవారం పట్టణంలోని ఐఎంఏ హాలులో జిల్లా అధికారులు, ఆర్డీఓలతో కన్వర్జెన్సీ స మావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ రవి మాట్లాడారు. జిల్లాలోని అయిదు మున్సిపాల్టీలు, మూడు రెవెన్యూ డివిజన్‌లలో అక్ర మ నిర్మాణాలు జరగకుండా డిస్ట్రిక్ట్‌ టాస్క్‌ ఫోర్స్‌, ఎన్ఫోరెన్స్‌మెంట్‌, స్క్వా డ్‌ కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. రెవెన్యూ, మున్సిపల్‌, ఆర్‌అండ్‌ బీ, పోలీస్‌, అగ్నిమాపక శాఖల అధికారులతో టాస్క్‌ ఫోర్స్‌ టీంను ఏ ర్పాటు చేస్తున్నామన్నారు. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌, సోషల్‌ మీడియాలలో వచ ్చే ప్రతీ ఫిర్యాదుపై ఈ కమిటీ సభ్యులు జాయింట్‌ తనిఖీలు నిర్వహిస్తా యన్నారు. టీఎస్‌ ఐ పాస్‌ నిబంధనలకు విరుద్దంగా అనుమతులు లే కుండా చేపడుతున్న అక్రమ కట్టడాలను గుర్తించి వాటి ఫొటోలను, వీడి యోలను తీసి పంచనామా రిపోర్ట్‌ తయారు చేసిన అనంతరం ప్రభుత్వ ఆదేశాల మేరకు కూల్చివేస్తామన్నారు. వారంలో ఒక సారి ఈ అంశంపై సమావేశం నిర్వహించి క్షేత్ర స్థాయిలో చేపట్టిన సమీక్షిం చుకోవాలన్నా రు. అక్రమ కట్టడాలపై చర్యలకు ఆలస్యం జరిగితే సంబంధిత అధికా రులే బాధ్యులు అవుతారన్నారు. నిర్మాణ దశలోనే పరిశీలించి కట్టడాలను గుర్తించి ప్రభుత్వ ఉత్తర్వులకు లోబడి కట్టడం జరిగేలా చర్యలు తీసుకో వాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ రాజేశం, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ అరుణ శ్రీ, జడ్పీ సీఈఓ శ్రీనివాస్‌, జగిత్యాల, కోరుట్ల ఆర్‌డీఓలు మాధురి, వినోద్‌ కుమార్‌, పలు ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement