Abn logo
Sep 26 2021 @ 23:44PM

కడపలో 200 ఎకరాల్లో YSR బెరైటీస్‌ క్లస్టర్‌

కడప(ఎర్రముక్కపల్లె), సెప్టెంబరు 26 : జిల్లాలో 200 ఎకరాల్లో వైఎస్‌ఆర్‌ బెరైటీస్‌ క్లస్టర్‌ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని ఏపీ పరిశ్రమల శాఖ సలహాదారులు రాజోలు వీరారెడ్డి పేర్కొన్నారు. కలెక్టరేట్‌ స్పందన హాల్‌లో ఆదివారం జేసీ ధర్మచంద్రారెడ్డి అధ్యక్షతన వాణిజ్య ఉత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్స్‌పోర్టు విలువలు పెంచేందుకు ఆక్వారంగంలో 6 ఫిషింగ్‌ హార్బర్లను ప్రాసెసింగ్‌ ఉత్పత్తులను తయారు చేసేందుకు కామన్‌ ఫెసిలిటీ సెంటర్‌ను ఏర్పాటు దిశగా ప్రభుత్వం ముం దుకు వెళుతుందన్నారు. ఎలక్ర్టానిక్స్‌ , ఆక్వారంగాలకు మంచి ఆదరణ ఉన్న నేపధ్యంలో వాటిని సందర్శించేందుకు ప్రభు త్వం తన సొంత నిధులతో వియత్నామ్‌, తైవాన్‌ దేశాలకు పర్యటించే ఆశక్తి ఉన్న పారిశ్రామిక వేత్తలు తమ పేర్లను వీ సా ఏర్పాటునకు పరిశ్రమల శాఖ జీఎంకు పంపించాలన్నా రు. జేసీ ధర్మచంద్రారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమల ఏర్పాటు, వచ్చే లాభాలను వివరించారు. పరిశ్రమల శాఖ జనరల్‌ మేనేజర్‌ చాంద్‌బాష మాట్లాడుతూ భారతప్రభుత్వం నిర్వహిస్తున్న ఆజాదీకా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా వాణిజ్య ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. ఏపీఐఐసీ పరిశ్రమల శాఖ జోనల్‌ మేనేజర్‌ జయలక్ష్మి, అసోసియేషణ్‌ సమన్వయకర్తలు, పరిశ్రమల శాఖ అధికారులు పాల్గొన్నారు.