గులాబ్‌ పంట నష్టాన్ని అంచనా వేయండి

ABN , First Publish Date - 2021-09-29T06:25:05+05:30 IST

గులాబ్‌ తుఫాన్‌ కారణంగా జరిగిన పంట నష్టాన్ని త్వరితగతిన అంచనా వేసి, గిరి రైతులకు నష్టపరిహారాన్ని చెల్లించి ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ ఎస్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు సియ్యారి దొన్నుదొర డిమాండ్‌ చేశారు.

గులాబ్‌ పంట నష్టాన్ని అంచనా వేయండి
పంటనష్టం జరిగిన దొరగడ రైతుల పంటలను పరిశీలిస్తున్న రాష్ట్ర ఎస్‌టీసెల్‌ అధ్యక్షుడు దొన్నుదొర


రైతులకు పరిహారం చెల్లించి ఆదుకోవాలి

టీడీపీ ఎస్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు దొన్నుదొర

అరకులోయ,సెప్టెంబరు 28: గులాబ్‌ తుఫాన్‌ కారణంగా జరిగిన పంట నష్టాన్ని త్వరితగతిన అంచనా వేసి, గిరి రైతులకు  నష్టపరిహారాన్ని చెల్లించి ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ ఎస్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు సియ్యారి దొన్నుదొర డిమాండ్‌ చేశారు. మంగళవారం చినలబుడు పంచాయతీ పరిఽధిలో చినలబుడు, హట్టగుడ, పకనగుడ తదితర గ్రామాలలో పెదలబుడు సర్పంచ్‌ పెట్టెలి దాసుబాబు, టీడీపీ మండల అధ్యక్షుడు శెట్టి బాబురావు, పార్టీ నేతలతో కలిసి ఆయన పంట నష్టాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పంట నష్టపోయిన రైతులతో మాట్లాడారు. వరి, రాగులు, కూరగాయలకు తీవ్ర నష్టం వాటిల్లిందని, కొంత పంట కొట్టుకుపోయిందని రైతులు టీడీపీ నేతల దృష్టికి తెచ్చారు. పంట నష్టాన్ని గుర్తించి, నష్టపరిహారాన్ని త్వరితగతిన చెల్లించాలని  దొన్నుదొర అధికారులను కోరారు. తాము ఐటీడీఏ పీఓకు పంట నష్టపరిహారంపై నివేదిక అందజేస్తామన్నారు. ఆయన వెంట మాజీ సర్పంచ్‌ మహాదేవ్‌, ఎంపీటీసీ మాజీ సభ్యుడు కుమార్‌, వార్డు సబ్యుడు దామోదర్‌ తదితరులు ఉన్నారు. 

Updated Date - 2021-09-29T06:25:05+05:30 IST