ఇసుక అక్రమ తరలింపును అడ్డుకున్న ప్రజలు

ABN , First Publish Date - 2021-10-28T03:32:56+05:30 IST

మండలంలోని మినగల్లు ఇసుక రీచ్‌ నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారంటూ గ్రామ సర్పంచ్‌ ఆధ్వర్యంలో స్థానికులు బుధవారం మరోసారి అడ్డుకున్నారు.

ఇసుక అక్రమ తరలింపును అడ్డుకున్న ప్రజలు
మినగల్లు రీచ్‌ వద్ద ఇసుక వాహనాలను అడ్డుకుని నిరసన వ్యక్తం చేస్తున్న గ్రామస్థులు

న్యాయం కోసం రోడ్డుపై బైఠాయించి నిరసన 

 

బుచ్చిరెడ్డిపాళెం, అక్టోబరు 27: మండలంలోని మినగల్లు ఇసుక రీచ్‌ నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారంటూ గ్రామ సర్పంచ్‌ ఆధ్వర్యంలో స్థానికులు బుధవారం మరోసారి అడ్డుకున్నారు. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అడ్డుకుని నిరసన వ్యక్తం చేయడంతో పోలీసులు సర్దుబాటు చేశారు. కాగా మరోసారి బుధవారం ఉదయం రీచ్‌ నుంచి ఇసుక రవాణా చేసే వాహనాలను అడ్డుకున్నారు. ప్రస్తుతం అనుమతులు లేకుండానే ఇసుక తవ్వేస్తున్నారన్నారు. అనుమతులు ఉన్నప్పుడు రెండు యంత్రాలకు అనుమతిస్తే 10 యంత్రాలతో 25 అడుగులకు పైగా ఇసుకను అక్రమంగా తవ్వి కోట్లాది రూపాయల సంపదను తరలించారన్నారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ ప్రసాద్‌రెడ్డి వచ్చి గ్రామస్థులకు నచ్చజెప్పి సర్దుబాటు చేశారు. ఈ క్రమంలో అనుమతులు చూపకుండా గ్రామ సంపదను దోపిడీ చేస్తుంటే పోలీసులు అనుమతులు పరిశీలించాల్సిందిపోయి తమ నిరసనకు అడ్డుతగలడం న్యాయం కాదన్నారు.   ఇసుక రీచ్‌లో జరుగుతున్న అక్రమాలపై కలెక్టర్‌, మైనింగ్‌, భూగర్భజలాల శాఖ అధికారులు విచారించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2021-10-28T03:32:56+05:30 IST