Advertisement
Advertisement
Abn logo
Advertisement

కేసీఆర్ కుర్చీకే హరీష్‌రావు ఎసరు పెట్టారు: ఈటల

కరీంనగర్: మంత్రి హరీష్‌రావుపై బీజేపీ నేత ఈటల రాజేందర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓట్ల కోసం మంత్రి నీచత్వానికి దిగారని మండిపడ్డారు. తన వల్లే మంత్రి పదవి వచ్చిందన్న విషయాన్ని హరీష్‌రావు మర్చిపోయారని ఈటల అన్నారు. సీఎం కేసీఆర్ కుర్చీకే హరీష్‌రావు ఎసరు పెట్టారని, ఆయన బండారం త్వరలో బయటపడుతుందంటూ ఈటల ఘాటైన వ్యాఖ్యలు చేశారు.


సొంతపార్టీ ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లను, నాయకులను వెలగట్టి కొంటున్నారని, అంగట్లో సరుకుల్లా కొంటున్న నీచుడు హరీష్‌రావని ఈటల తీవ్ర స్థాయిలో ఆరోపించారు. హరీష్ పతనం మొదలైందన్నారు. గతాన్ని మరిచిపోయారని, సహచరునిపై పిచ్చి ప్రేలాపనలు చేస్తే హుజురాబాద్‌లో పతనం తప్పదని, ఇక్కడి నుంచే హరీష్ రాజకీయ భవిష్యత్‌కు బొంద పెడతానని ఈటల హెచ్చరించారు.

Advertisement
Advertisement