Advertisement
Advertisement
Abn logo
Advertisement

దళిత బందుకు రెండు లక్షల కోట్లు కూడా చాలవు: ఈటల

కరీంనగర్: సీఎం కేసీఆర్ ప్రకటించిన దళిత బంధుకు రెండు లక్షల కోట్లు కూడా చాలవని బీజేపీ నేత ఈటెల రాజేందర్ అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వచ్చే ఆదాయంపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వెలమలకి నాలుగు పదవులు ఇచ్చి.. దళితులకు ఒక్క పదవా? అని ప్రశ్నించారు. సీఎంవోలో ఒక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ అధికారి కూడా లేరన్నారు. దళిత బంధుపై ఓపెన్ డిబేట్‌కు తాను సిద్ధమని.. సీఎం కేసీఆర్ బృందంతో తాను చర్చకు రెడీ అన్నారు. సర్వేల్లో ముఖ్యమంత్రి పని తీరు బయట పడిందన్నారు. సోషల్ మీడియాలో మాట్లాడుతున్న వారిని బెదిరిస్తే తిరుగుబాటు చేస్తారన్నారు. 67 ఏళ్ల కేసీఆర్ జీవితంలో ఏనాడూ జై భీమ్ అనలేదని, మొదటిసారి అంబేద్కర్ పక్కన కేసీఆర్ ఫోటో పెట్టుకున్నారని విమర్శించారు. ఆకునూరి మురళి, ఆర్ఎస్ ప్రవీణ్‌లు ఎందుకు రాజీనామా చేశారన్నారు. ప్రదీప్ చంద్రకు ఎందుకు గౌరవం ఇవ్వలేదని నిలదీశారు. రాజకీయాల్లో లెఫ్టూ.. రైటూ ఉండవని.. సీఎం కేసీఆర్ పిచ్చి పనులు చేస్తే సహించమని ఈటల రాజేందర్ హెచ్చరించారు.

Advertisement
Advertisement