Abn logo
Sep 28 2021 @ 14:08PM

కేసీఆర్ అహంకారానికి.. హుజురాబాద్ ప్రజలకు జరుగుతున్న ఎన్నిక...: ఈటల

కరీంనగర్: హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక షెడ్యూల్‌ను ఎట్టకేలకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం విడుదల చేసింది. దీంతో అక్కడ రాజకీయం వేడెక్కింది. టీఆర్ఎస్, బీజేపీలు పోటీపోటీగా ప్రచారం చేస్తున్నాయి. హుజురాబాద్‌లో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ అహంకానికి, హుజురాబాద్ ప్రజల ఆత్మగౌరవానికి జరుగుతున్న ఎన్నిక అని అన్నారు. సిఎం, మంత్రి హరీష్ రావు ప్రజాస్వామ్య విలువలను అపహాస్యం చేశారని విమర్శించారు. రాత్రి పూట పోలీస్ జీపులతో బీజేపీ నేతలను భయపెడుతున్నారని, టీఆర్ఎస్ నీచపు పార్టీ అని, ఆ పార్టీ నేతలు నీచపు మనుషులని దుయ్యబట్టారు. చిల్లర చేష్టలు చేస్తే.. ప్రజలు సహించరన్నారు. ఆర్డీవో ఆధ్వర్యంలోనే దొంగ ఓట్లు నమోదు అవుతున్నాయని, దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. అక్టోబర్ 2న హుజురాబాద్‌లో బండి సంజయ్ ర్యాలీ ఉంటుందని ఈటల రాజేందర్ చెప్పారు.

ఇవి కూడా చదవండిImage Caption