Abn logo
May 4 2021 @ 15:44PM

టీఆర్‌ఎస్‌లో అంతా స్క్రిప్ట్ ప్రకారమే..: ఈటల

కరీంనగర్: టీఆర్‌ఎస్‌లో అంతా స్క్రిప్ట్ ప్రకారమే మాట్లాడుతారని.. రాసిచ్చింది మాట్లాడటం తప్ప సొంతంగా మాట్లాడే అధికారం ఎవ్వరికీ లేదని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మంగళవారం ఈటల ఏబీఎన్‌తో మాట్లాడుతూ.. ఇరవై ఏళ్లలో టీఆర్ఎస్‌ పార్టీలో చాలా చూశానని.. అందరి లిస్ట్ నా దగ్గర ఉందని.. మంత్రులుగా కాకుండా.. మనుషులుగా మాట్లాడాలని హితవు పలికారు. కనీసం ఆ మంత్రులకు అయినా ఇకనుంచి కేసీఆర్ గౌరవం ఇవ్వాలని కోరుతున్నానని, ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ ఇస్తారని ఆశిస్తున్నానని ఈటల రాజేందర్ తెలిపారు. 


కేటీఆర్ సీఎం అభ్యర్థిత్వాన్ని స్వాగతించా..

‘‘ఎవరి గురించి కామెంట్ చేయను.. నన్ను ఈ స్థానంలోకి తీసుకొచ్చింది టీఆర్‌ఎస్‌, సీఎం కేసీఆర్.. టీఆర్‌ఎస్‌కి వ్యతిరేకంగా పని చేయలేదు.. మంత్రి కేటీఆర్ సీఎం అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించలేదు.. స్వాగతించా... నాపై కక్ష సాధించడం సరికాదు.. ఎవరి మాటలపై స్పందించను.. నాతో ఎవరేం మాట్లాడారో తెలుసు.. సీఎం అహంకారంపై మంత్రులే మాట్లాడారు.. సీఎం‌కు ఇంత అహంకారం ఉంటదా అని వారే అన్నారు’’ అని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. 

Advertisement
Advertisement
Advertisement