Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఈటలదే విజయం: బండి సంజయ్‌

శంషాబాద్‌: హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ ఘన విజయం సాధిస్తారని దీమా వ్యక్తం చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని వందల కోట్ల రుపాయలు ఖర్చు చేసిన కేసీఆర్‌కు, టీఆర్‌ఎస్‌కు త్వరలోనే తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. ఈవీఎంలు మార్చాలని చూసినా తమ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారని, కేసీఆర్‌ అధికారం కోసం ఎంతకైనా తెగిస్తున్నాడన్నారు. డబ్బు, మద్యం విచ్చలవిడిగా పంచినా ఓట్లు మాత్రం బీజేపీకే వేశారని చెప్పారు. తెలంగాణ రాజకీయాల్లో త్వరలోనే పెను మార్పులు సంభవిస్తాయని బండి సంజయ్‌ జోస్యం చెప్పారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement