Abn logo
Oct 23 2021 @ 14:43PM

రేవంత్‌ను కలవడం చట్ట విరుద్ధమా?: ఈటల

కరీంనగర్ : కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో మీటింగ్‌పై మంత్రి కేటీఆర్‌కు బీజేపీ హుజూరాబాద్ అభ్యర్థి ఈటల కౌంటర్ ఇచ్చారు. టీఆర్‌ఎస్‌కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత అందరినీ కలిసి వందలాది మందితో మాట్లాడారు. సీపీఎం, సీపీఐతోనూ కలిసి మాట్లాడినట్టు తెలిపారు. అందులో భాగంగానే రేవంత్ రెడ్డిని కలిశానన్నారు. తనకు సంస్కారం ఉందని ఈటల తెలిపారు. అందరితో మాట్లాడే వాతావరణం ఉండాలి కానీ.. కుసంస్కారం ఉండొద్దన్నారు. కిరణ్ కుమార్, వైఎస్, రోశయ్యతోనూ మాట్లాడానన్నారు. కేసీఆర్ వచ్చాక ఇతర పార్టీలతో బంధాలు తెగిపోయాయన్నారు. రేవంత్ రెడ్డిని కలవడం.. సంస్కార హీనమైతే కాదు కదా అన్నారు. అవేమీ నిషేధించబడ్డ పార్టీలు కాదు కదా అన్నారు. తాను ఇప్పుడు కూడా కలుస్తానని.. తనకు ఆ దమ్ము ఉందన్నారు. కలవడం చట్ట విరుద్దామా..? అని ప్రశ్నించారు. పార్టీల మధ్య సత్సంబంధాలు ఉండాలని.. బీజేపీ, కాంగ్రెస్ ఉత్తర దక్షిణ ధృవాలని అవి కలిసే ఆస్కారం లేదని ఈటల పేర్కొన్నారు.

తెలంగాణ మరిన్ని...