ఆ కలెక్టర్‌పై కేసులు పెడతాం: ఈటల రాజేందర్ సతీమణి

ABN , First Publish Date - 2021-12-07T01:42:39+05:30 IST

70 ఎకరాలు ఆక్రమించుకున్నామంటోన్న కలెక్టర్‌పై ఖచ్చితంగా కేసులు పెడతామని ఈటల రాజేందర్ సతీమణి జమున హెచ్చరించారు. మాసాయిపేట మండలం అచ్చంపేట...

ఆ కలెక్టర్‌పై కేసులు పెడతాం: ఈటల రాజేందర్ సతీమణి

హైదరాబాద్: 70 ఎకరాలు ఆక్రమించుకున్నామంటోన్న కలెక్టర్‌పై ఖచ్చితంగా కేసులు పెడతామని ఈటల రాజేందర్ సతీమణి జమున హెచ్చరించారు. మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట్ పరిధిలో అసైన్డ్  భూములను జమునా హ్యాచరీస్ కబ్జా వాస్తవమేనని మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్ మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో స్పందించిన జమున... కలెక్టర్ టీఆర్ఎస్ కండువా కప్పుకుని మాట్లాడితే బాగుంటుందన్నారు.  ‘‘మా వ్యాపారాలకు అనుమతులు ఇవ్వదొద్దని పెద్దలు చెప్పిన్లటు అధికారులే చెప్తున్నారు. చాలా మంది మంత్రుల పౌల్ట్రీ ఫాంలకు పొల్యూషన్ సర్టిఫికేట్స్ ఉన్నాయా?. ఈటల టీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు ఒకలా.. బయటకొచ్చినాక మరొకలా వ్యవహరిస్తున్నారు. మా భూముల్లో పెద్ద షెడ్డులు వేసుకుంటే తప్పేంటి?.’’ అని జమున ప్రశ్నించారు. 


మహిళా సాధికారిత గురించి మాట్లాడే ముఖ్యమంత్రి తనను మానసికంగా హింసించటం ఎంతవరకు సబబు అని ఆమె ప్రశ్నించారు. హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాలను భవిష్యత్తులో ఎదుర్కోవటానికి సీఎం కేసీఆర్ సిద్ధంగా ఉండాలని ఆమె హెచ్చరించారు. తమను రాజకీయంగా ఎదుర్కోలేకనే వ్యాపారాల మీద దెబ్బ కొడుతున్నారని జమున ఆరోపించారు. 33 జిల్లాల్లో ఈటల రాజేందర్ పర్యటిస్తారని, ఎదుర్కోవటానికి కేసీఆర్ సిద్ధంగా ఉండాలన్నారు. తెలంగాణ ఉద్యమం కోసం సొంత భూములను అమ్ముకున్నామని చెప్పారు. తమ గెలుపును ఓర్వలేక ఈటల రాజేందర్‌ను రోడ్డు మీదకు తేవాలని ప్రయత్నిస్తున్నారని జమున మండిపడ్డారు. 

Updated Date - 2021-12-07T01:42:39+05:30 IST