Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఈటల దళితులను మోసం చేస్తున్నారు: హరీష్‌రావు

కరీంనగర్‌: దళితబంధు రాదంటూ బీజేపీ నేత ఈటల రాజేందర్ దళితులను మోసం చేస్తున్నారని మంత్రి హరీష్‌రావు దుయ్యబట్టారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈటల చెప్పే మోసపూరిత మాటలు నమ్మొద్దని సూచించారు. హుజురాబాద్ దళితబంధు విజయం రాష్ట్రానికి, దేశానికి ఆదర్శం కావాలని ఆకాంక్షించారు. దళితబంధుకు పైసలు ఎక్కడివని ఈటల మాట్లాడుతున్నారని, మరి ఇప్పుడు అందరికీ దళితబంధు వస్తుంది.. దీనిపై ఈటల ఏం చెప్తారు? అని ప్రశ్నించారు. ప్రజలపై కుట్రలు చేస్తున్న చీడ పురుగులను ఏరిపారేయాలని హరీష్‌రావు పిలుపునిచ్చారు.

Advertisement
Advertisement