Advertisement
Advertisement
Abn logo
Advertisement

వేధింపులు ఆపకపోతే భరతం పట్టడం ఖాయం: ఈటల రాజేందర్‌

కమలాపూర్‌: హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని బీజేపీ కార్యకర్తలపై రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు వేధింపులను ఆపకపోతే మీ భరతం పట్టడం ఖాయమని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ హెచ్చరించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రగతిభవన్‌ నుంచి సీఎం కేసీఆర్‌ ఆదేశిస్తే వాటిని మంత్రి హరీష్‌రావు ఆచరిస్తున్నాడని ఆరోపించారు. రాత్రి పూట పోలీసుల అండతో మంత్రి హరీష్‌రావు బీజేపీ నాయకుల ఇళ్ల వద్దకు వచ్చి టీఆర్‌ఎస్‌లోకి రావాలని అడుగుతున్నాడని, ఆ అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఇలాగే ఇంకా చేస్తే తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. ఇప్పటికైనా తమ కార్యకర్తలను వేధించడం ఆపివేయాలన్నారు. తమ కార్యకర్తలపై దౌర్జన్యానికి పాల్పడితే భరతం పట్టడం ఖాయమన్నారు. కేసీఆర్‌ అధికారం 2023 వరకే ఉంటుందని జోస్యం చెప్పారు. కేసీఆర్‌ ఒకప్పుడు మాట్లాడితే తెలంగాణ జాతి పులకించిపోయేదని, ఇప్పుడు సీఎం మాట్లాడితే టీవీలు బంద్‌ చేస్తున్నారని ఈటల రాజేందర్‌ తెలిపారు. 

Advertisement
Advertisement