నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకోవద్దు: ఈటల
ABN , First Publish Date - 2022-01-28T22:21:43+05:30 IST
నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకోవద్దని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సూచించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ
మహబూబాబాద్: నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకోవద్దని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సూచించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇది మాటల ప్రభుత్వమే తప్ప.. చేతల ప్రభుత్వం కాదని తప్పుబట్టారు. కేంద్రం బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీకి నిధులు కేటాయించకపోతే.. రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేస్తామన్న మాట ఏమైంది? అని ఈటల ప్రశ్నించారు. ప్రతి విషయంలో కేంద్రంపై నెపం వేయడం సరికాదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి పతనం తప్పదని ఈటల రాజేందర్ హెచ్చరించారు.