Advertisement
Advertisement
Abn logo
Advertisement

నాపై దాడికి కుట్ర చేస్తున్నారేమో: ఈటల

కరీంనగర్: 13, 14 తేదీలలో తనమీదనే తానే దాడి చేయించుకుంటున్న అని మంత్రులు అంటున్నారని, తన మీద దాడికి ఏమన్నా కుట్ర చేస్తున్నారేమో అని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అనుమానం వ్యక్తం చేశారు. కేసీఆర్ అబద్ధాల మాటలు పక్కనపెట్టి, ముందు దళితులకు  పది లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తానే రాశాను అని ఓ దొంగ లేఖ నెపం పెట్టీ ఎగపెట్టాలని చూస్తే ఖబడ్దార్ అని హెచ్చరించారు. అన్ని వర్గాల్లోని పేదలకు 10లక్షలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. 2023లో భూ స్థాపితం అయ్యేది తాను కాదు.. మీరు అని గుర్తుంచుకోవాలన్నారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement