ఇదేం రహస్యం.. జలపాతం వెనుక రగిలే జ్వాల.. ఎక్కడుందంటే..

ABN , First Publish Date - 2021-12-25T08:34:20+05:30 IST

ప్రపంచంలో ఎన్నో అద్భుత ప్రదేశాలున్నాయి. కొన్నింటి గురించి సమాచారం ఉంటే.. మరికొన్ని రహస్యాలుగా ఇప్పటికీ ఉన్నాయి. వాటిలో ఒకటి ఎటర్నల్ ఫ్లేమ్ ఫాల్స్. ఇది అమెరికా లోని న్యూయార్క్ నగరంలో ఉంది. న్యూయార్క్‌లోని చెస్ట్‌ నట్‌ రిడ్జ్‌ అనే పార్క్‌...

ఇదేం రహస్యం.. జలపాతం వెనుక రగిలే జ్వాల.. ఎక్కడుందంటే..

ప్రపంచంలో ఎన్నో అద్భుత ప్రదేశాలున్నాయి. కొన్నింటి గురించి సమాచారం ఉంటే.. మరికొన్ని రహస్యాలుగా ఇప్పటికీ ఉన్నాయి. వాటిలో ఒకటి ఎటర్నల్ ఫ్లేమ్ ఫాల్స్. ఇది అమెరికా లోని న్యూయార్క్ నగరంలో ఉంది. న్యూయార్క్‌లోని చెస్ట్‌ నట్‌ రిడ్జ్‌ అనే పార్క్‌ ఉంది. అక్కడ షేల్ క్రీక్ ప్రిజెర్వ్ అనే ఓ ప్రదేశంలో ఓ జలపాతం జాలువారుతూ ఉంది.


ఈ జలపాతం ప్రత్యేకత ఏమిటంటే.. దీని కింది భాగంలో ఒక భారీ దీపం ఎప్పుడూ వెలుగుతూ ఉంటుంది. చుట్టుపక్కలంతా నీరు ఉన్నా ఈ దీపం ఎప్పుడూ ఆరిపోలేదు. దీని వెనుక ఏం రహస్యం ఉందని.. అమెరికా ప్రభుత్వం పరిశోధన కూడా చేసింది. పరిశోధకులు దీని గురించి చెబుతూ.. "ఆ దీపం అలా రగులుతూ ఉండడానికి కారణం ఉంది. ఆ దీపం కింద రాళ్లలో మిథేన్ గ్యాస్ ఉంది. అందుకే దీన్ని మనం ఆర్పినా అది మళ్లీ వెలుగుతోంది" అని అన్నారు. జలపాతం కింద ఎప్పుడూ దీపం రగులుతూ ఉండడంతో దీనిని ఎటర్నల్ ఫ్లేమ్ ఫాల్స్ అని అంటారు.

Updated Date - 2021-12-25T08:34:20+05:30 IST