శాసో్త్రక్తంగా నిత్యారాధనలు

ABN , First Publish Date - 2022-01-21T06:55:41+05:30 IST

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామికి గురువారం నిత్యవిధి పూజాకైంకర్యాలు శాసో్త్రక్తంగా నిర్వహించారు.

శాసో్త్రక్తంగా నిత్యారాధనలు
బాలాలయంలో గజవాహన సేవోత్సవం నిర్వహిస్తున్న అర్చకులు

నూతన గది నిర్మాణానికి రూ.10లక్షల విరాళం

విమానగోపురం బంగారు తాపడానికి రూ.51వేల విరాళం

యాదాద్రి టౌన, జనవరి 20: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామికి గురువారం నిత్యవిధి పూజాకైంకర్యాలు శాసో్త్రక్తంగా నిర్వహించారు. వేకువజామున సుప్రభాతంతో మొదలైన నిత్యార్చనలు రాత్రివేళ శయనోత్సవాలతో ముగిశాయి. ముందుగా ప్రధానాలయంలోని స్వయంభువులను ఆరాధించిన ఆచార్యులు బాలాలయ కవచమూర్తులను హారతితో కొలిచారు. మండపంలో ఉత్సవమూర్తులను పంచామృతాలతో అభిషేకించి తులసీదళాలతో అర్చించారు. అనంతరం సుదర్శన నారసింహ హోమం, నిత్య తిరుకల్యాణపర్వాలు ఆగమ శాస్త్రరీతిలో కొనసాగాయి. కొండపైన రామలింగేశ్వరస్వామికి, చరమూర్తులకు నిత్య పూజలు శైవాగమ పద్ధతిలో నిర్వహించారు. అదేవిధంగా అనుబంధ పాతగుట్ట ఆలయంలోనూ నిత్య పూజలు సంప్రదాయరీతిలో నిర్వహించారు. వివిధ విభాగాల ద్వారా ఆలయ ఖజానాకు రూ.6,92,528 ఆదాయం సమకూరింది. 

కాటేజీ నిర్మాణానికి విరాళాలు 

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న భక్తులు బసచేసేందుకు కాటేజీ నిర్మాణం కోసం గురువారం హైదరాబాద్‌కు చెందిన భక్తులు సామల లక్ష్మీవెంకట్‌రెడ్డి, సామల అభిషేక్‌రెడ్డి రూ.10లక్షల విరాళాన్ని చెక్కు రూపంలో అందజేశారు. దాత కుటుంబసమేతంగా స్వామివారిని దర్శించుకుని బాలాలయ కవచమూర్తుల చెంత ప్రత్యేక పూజల్లో పాల్గొని ఉత్సవమూర్తుల చెంత విరాళం చెక్కును ఏఈవోలు గజవెల్లి రమేశబాబు, గట్టు శ్రవణ్‌కుమార్‌లకు అందజేశారు. స్వామివారి విమాన గోపురం బంగారు తాపడం కోసం హైదరాబాద్‌కు చెందిన భక్తుడు రామానంద నాథ రూ.51,116 నగదు రూపంలో విరాళాన్ని అందజేశారు. 



 

Updated Date - 2022-01-21T06:55:41+05:30 IST