ఎథేరియం... భారీ జంప్...

ABN , First Publish Date - 2021-05-17T20:39:43+05:30 IST

క్రిప్టోకరెన్సీ ఎథేరియం... పంచ అతిపెద్ద డిజిటల్ కరెన్సీ బిట్ కాయిన్ విలువలో సగానికి చేరుకుంది.

ఎథేరియం... భారీ జంప్...

ముంబై : క్రిప్టోకరెన్సీ ఎథేరియం... పంచ అతిపెద్ద డిజిటల్ కరెన్సీ బిట్ కాయిన్ విలువలో సగానికి చేరుకుంది. మార్కెట్ క్యాపిటలైజేషన్ భారీగా పెరగడమే ఇందుకు కారణం. వీటి ఆస్తుల మధ్య సగటు నిష్పత్తి 0.08 శాతంగా ఉంది. సమీప భవిష్యత్తులో ఎథేరియం... క్రిప్టో బిట్ కాయిన్‌ను అధిగమించి ప్రపంచ అతిపెద్ద క్రిప్టోకరెన్సీగా మారుతుందని భావిస్తున్నారు. ఇటీవలి కాలంలో బిట్ కాయిన్ కంటే ఎథేరియం ఎగసిపడుతోంది.


బిట్ కాయిన్ గత నెలలో ఓ సమయంలో 64వేల డాలర్లను అధిగమించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇప్పుడు 48 వేల డాలర్లకు పడిపోయింది. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ చేసిన ఓ ట్వీట్ అనంతరం... బిట్ కాయిన్ విలువ భారీగా పతనమైన విషయం తెలిసిందే. అదే సమయంలో డోజి కాయిన్ విలువపెరగడం గమనార్హం. 

Updated Date - 2021-05-17T20:39:43+05:30 IST