భారత్‌కు 5 లక్షల యూరోల సహాయం ప్రకటించిన ఈయూ!

ABN , First Publish Date - 2020-05-23T19:17:57+05:30 IST

అంఫన్ తుఫాన్ బాధితుల సహాయం కోసం ఐరోపా సమాఖ్య భారత్‌కు 5 లక్షల యూరోల సహాయం ప్రకటించింది.

భారత్‌కు 5 లక్షల యూరోల సహాయం ప్రకటించిన ఈయూ!

న్యూఢిల్లీ: అంఫన్ తుఫాను బాధితుల సహాయం కోసం ఐరోపా సమాఖ్య భారత్‌కు 5 లక్షల యూరోల సహాయం ప్రకటించింది. వారికి సహాయం అందించడంతో పాటూ కరోనాతో పారుడుతున్న వైద్యసిబ్బంది రక్షణకు ఈయూ తక్షణ సాయం అందించిందని ఐరోపా సమాఖ్య కిషనర్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. తొలి విడత సహాయంగా భారత్‌కు ఈ నిధులను ఈయూ విడుదల చేసింది. అంఫన్ ప్రభావిత దేశమైన బాంగ్లాదేశ్‌కు కూడా 1.1 కోట్ల యూరోల సహాయం ప్రకటించింది. అంఫన్ కారణంగా పశ్చిమ బెంగాల్ అత్యధికంగా ప్రభావితమైన విషయం తెలిసిందే. ఆ రాష్ట్రంలో 80 మంది ప్రాణాలు కల్పోగా..వేల మంది నిరాశ్రయులయ్యారు. ఒడిశా రాష్ట్రంలోనూ అంఫన్ పెను విధ్వంసం సృష్టించింది. విద్యుత్, టెలిఫోన వ్యవస్థలను తీవ్ర నష్టం వాటిల్లింది. 

Updated Date - 2020-05-23T19:17:57+05:30 IST