ఐరోపాలో ‘మరమ్మతు హక్కు’!

ABN , First Publish Date - 2021-03-02T07:19:30+05:30 IST

ప్రమాదకర స్థాయిలో పేరుకుపోతున్న ఈ-చెత్తను తగ్గించేందుకు ఐరోపా సమాఖ్య(ఈయూ) కొత్త నిర్ణయం తీసుకుంది. రిఫ్రిజిరేటర్లు, హెయిర్‌ డ్రయర్లు, టీవీల వంటి గృహాపకరణాలను ఉత్పత్తి చేసే సంస్థలు, తమ వస్తువులు పదేళ్ల కాలం

ఐరోపాలో ‘మరమ్మతు హక్కు’!

ఈ-చెత్తను తగ్గించేందుకు ఈయూ నిర్ణయం


బెర్లిన్‌, మార్చి 1: ప్రమాదకర స్థాయిలో పేరుకుపోతున్న ఈ-చెత్తను తగ్గించేందుకు ఐరోపా సమాఖ్య(ఈయూ) కొత్త నిర్ణయం తీసుకుంది. రిఫ్రిజిరేటర్లు, హెయిర్‌ డ్రయర్లు, టీవీల వంటి గృహాపకరణాలను ఉత్పత్తి చేసే సంస్థలు, తమ వస్తువులు పదేళ్ల కాలం పనిచేసేందుకు సంస్థ తరఫున సహా యం అందించాల్సి ఉంటుంది. అంటే.. ఆ పదేళ్లలో వస్తువు విడిభాగాలు మార్కెట్‌లో లభించేలా చూడటంతో పాటు, వినియోగదారులు స్వయంగా రిపేర్‌ చేసుకునేందుకు మరమ్మతు సూచనల చేతిపుస్తకాన్నీ సమకూర్చాల్సి ఉంటుంది. మొత్తం 27 దేశాలు కలిగిన ఈయూలో సోమవారం నుంచి ఈ నిబంధన అమలులోకి వచ్చింది. దీన్ని ‘మరమ్మతు హక్కు’గా వ్యవహరిస్తున్నారు.

Updated Date - 2021-03-02T07:19:30+05:30 IST