ఇక పురుగులనూ తినండి.. అధికారిక అనుమతులిచ్చిన ఫుడ్ బోర్డ్

ABN , First Publish Date - 2021-01-14T15:41:10+05:30 IST

సంక్రాంతి సందర్భంగా మనం ఇక్కడ అరిసెలు, జంతికలు, పూర్ణాలు, పులిహోర వండుకుని ఆనందంగా తింటున్నాం కదా..! అయితే యూరప్‌లో కూడా ఓ స్పెషల్ ఆహారానికి...

ఇక పురుగులనూ తినండి.. అధికారిక అనుమతులిచ్చిన ఫుడ్ బోర్డ్

ఇంటర్నెట్ డెస్క్: సంక్రాంతి సందర్భంగా మనం ఇక్కడ అరిసెలు, జంతికలు, పూర్ణాలు, పులిహోర వండుకుని ఆనందంగా తింటున్నాం కదా..! అయితే  యూరప్‌లో కూడా ఓ స్పెషల్ ఆహారానికి అధికారిక ఆమోదం తెలిపింది యూరోపియన్ యూనియన్ ఫుడ్ బోర్డ్. అదేంటో గొప్ప వంటకం అనుకోకండి. అక్షరాలా పురుగులు. మీల్‌వర్మ్స్ అనే బీటిల్ జాతి పురుగులను తినేందుకు యూరోపియన్ ఫుడ్ సేఫ్టీ ఏజెన్సీ(ఈఎఫ్‌ఎస్‌ఏ) అధికారికంగా అనుమతులిచ్చింది. ఈ పురుగులను ఇప్పటికే అక్కడ పక్షులు, తొండలు వంటి పెంపుడు జంతువులకు ఆహారంగా వినియోగిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈఎఫ్‌ఎస్‌ఏ ప్రకటనతో అక్కడ మనుషులు సైతం ఈ పురుగులను తినేందుకు అనుమతి లభించింది. ఈ పురుగుల్లో ప్రోటీన్స్, విటమిన్స్, ఫ్యాట్, ఫైబర్స్ వంటి మనుషులకు కావాల్సిన అన్ని పోషక విలువలూ అత్యధికంగా ఉంటాయని, అందుకే వీటిని తినేందుకు అనుమతి ఇచ్చామని ఈఎఫ్ఎస్ఏ వెల్లడించింది.

Updated Date - 2021-01-14T15:41:10+05:30 IST