మరింత వేగంగా కరోనా

ABN , First Publish Date - 2022-01-19T06:24:06+05:30 IST

కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి.సోమ,మంగళవారాల నడుమ 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలోని అన్ని జిల్లాకంటే ఎక్కువగా మరో 1534మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది.అదే వ్యవధిలో కరోనా వైరస్‌ కారణంగా ఒకరు మృతి చెందారు

మరింత వేగంగా కరోనా
తిరుపతిలో రుయాస్పత్రి వద్ద కరోనా పరీక్షలకోసం క్యూకట్టిన బాధితులు

రాష్ట్రంలో అత్యధిక కేసులు జిల్లాలోనే  


తాజా పాజిటివ్‌లు 1534: ఒకరి మృతి


తిరుమల, జనవరి18(ఆంధ్రజ్యోతి):కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి.సోమ,మంగళవారాల నడుమ 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలోని అన్ని జిల్లాకంటే ఎక్కువగా  మరో 1534మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది.అదే వ్యవధిలో కరోనా వైరస్‌ కారణంగా ఒకరు మృతి చెందారు.యాక్టివ్‌ పాజిటివ్‌ కేసులు కూడా రాష్ట్రంలో అత్యఽధికంగా 8,332కు చేరాయి. కొత్తగా గుర్తించిన కేసులు మండలాల వారీగా....తిరుపతి అర్చన్‌లో 540, చిత్తూరులో 170,తిరుపతి రూరల్‌ పరిధిలో 110,రేణిగుంటలో 74,మదనపల్లెలో 68,  కుప్పంలో 66, పీలేరులో 43, శ్రీకాళహస్తిలో 38, చంద్రగిరిలో 30, పుత్తూరులో 23,పాకాలలో 20, కేవీపల్లె, పూతలపట్టు మండలాల్లో 19 చొప్పున, వాల్మీకిపురంలో 17, గుడిపాలలో 14, పెనుమూరు, తంబళ్లపల్లె మండలాల్లో 13 చొప్పున, కలికిరి, వి.కోట మండలాల్లో 12 చొప్పున,నగరి, పుంగనూరు మండలాల్లో 11 చొప్పున,  రొంపిచర్ల, ఏర్పేడు మండలాల్లో  10 చొప్పున, గుడుపల్లెలో 9, బి.కొత్తకోట, గంగాధరనెల్లూరు, నారాయణవనం, పుంగనూరు, రామకుప్పం, రామసముద్రం, సోమల,పలమనేరు మండలాల్లో  8 చొప్పున, కలకడ, సత్యవేడు, తొట్టంబేడు మండలాల్లో  7 చొప్పున,  చిన్నగొట్టిగల్లు, గంగవరం, కార్వేటినగరం, నిండ్ర, పెద్దతిప్పసముద్రం, పులిచెర్ల, శాంతిపురం,  శ్రీరంగరాజపురం మండలాల్లో 6 చొప్పున, బైరెడ్డిపల్లెలో 5, ఐరాల, పెద్దమండ్యం, పెద్దపంజాణి మండలాల్లో 4 చొప్పున, ములకలచెరువు, రామచంద్రాపురం, తవణంపల్లె, వడమాలపేట మండలాల్లో  3 చొప్పున, గుర్రంకొండ, నిమ్మనపల్లె, వరదయ్యపాళెం మండలాల్లో 2 చొప్పున, బంగారుపాళ్యం, బుచ్చినాయుడుకండ్రిగ, చౌడేపల్లె, వెదురుకుప్పం, యాదమరి, ఎర్రవారిపాళెం మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదయ్యాయి.


తగ్గిన పరీక్షలు  


శ్రీకాళహస్తి, జనవరి 18: జిల్లాలో నాలుగు రోజులుగా కరోనా నిర్ధారణ పరీక్షలు గణనీయంగా తగ్గుముఖం పట్టినట్లు సమాచారం. నమూనాల సేకరణ తగ్గినప్పటికీ పాజిటివ్‌ కేసులు మాత్రం  పెరగడం గమనార్హం. ఉదాహరణకు శ్రీకాళహస్తి ప్రభుత్వాస్పత్రిలో రోజూ సగటున వంద నమూనాలను గత యేడాదినుంచి అధికారులు సేకరిస్తున్నారు. గత యేడాది డిసెంబరులో కూడా ఆర్టీపీసీఆర్‌ విధానం ద్వారా నమూనాల సేకరణ కిట్లు(వీపీఎం)లు అవసరమైనన్ని సరఫరా చేసేవారు. ఐదు రోజులక్రితం వరకు కూడా వీపీఎంలు అవసరమైనన్ని తిరుపతి నుంచి అధికారులు సరఫరా చేసేవారు. కానీ ఎందుకో కిట్ల సరఫరా ఒక్కసారిగా తగ్గిపోయింది.సోమవారం శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రిలో 10 పరీక్షలు చేయగా మంగళవారం 9మంది నుంచే నమూనాలు సేకరించారు. తరువాత వచ్చినవారికి కిట్లు లేవని చెబుతుండడంతో ఎంతోమంది నిరాశతో వెనుదిరుగుతున్నారు.ఈ విషయమై ఆస్పత్రి సిబ్బందితో పలువురు వాగ్వాదానికి దిగుతున్నారు. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోజుకు 500 నుంచి 600 వరకు కొవిడ్‌ పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా 300 టెస్టులు కూడా చేయడం లేదని ఆరోపణలున్నాయి.ప్రభుత్వ కేంద్రాల్లో కిట్లు తక్కువ ఉన్నాయంటూ కేవలం అత్యవసర పరిస్థితులు, తీవ్ర లక్షణాలున్న వారికి మాత్రమే పరీక్షలు నిర్వహిస్తామని చెబుతుండడంతో ప్రజలు ప్రైవేటు వైపు చూస్తున్నారు. ఇదే అదనుగా కొందరు ప్రైవేటు ల్యాబ్‌ల నిర్వాహకులు ప్రభుత్వం నిషేధించిన ర్యాపిడ్‌ కిట్ల ద్వారా అనధికారికంగా పరీక్షలు చేస్తున్నారు.రెండు నిమిషాల్లో అది కూడా అనధికారిక ఫలితం రావడంతో ప్రజలు వీటిపట్ల మొగ్గుచూపుతున్నారు.ఒక్కో పరీక్షకు రూ.800 నుంచి రూ.1,200వరకు గుంజేస్తున్నారు. ఈ అనధికార దోపిడీని అరికట్టాలంటే ప్రభుత్వ కేంద్రాల్లోనే నమూనాల సేకరణ పెంచాల్సివుంది.

Updated Date - 2022-01-19T06:24:06+05:30 IST