Abn logo
Sep 21 2021 @ 23:56PM

ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలి: ఎమ్మెల్సీ

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్‌

ఆదిలాబాద్‌టౌన్‌, సెప్టెంబరు 21: టీఆర్‌ఎస్‌ పార్టీ బలోపేతానికి నూతన కమిటీలో ఎన్నికైన నేతలు, అధ్యక్ష కార్యదర్శులు, కార్యకర్తలు  సైనికుడిలా పని చేయాలని ఆదిలాబాద్‌ ఇన్‌చార్జి, నిజామాబాద్‌ ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్‌ అన్నారు. రాష్ట్ర కార్యదర్శి అరిగెల నాగేశ్వర్‌రావు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కమిటీల సమావేశాన్ని మంగళవారం స్థానిక గాయత్రి గార్డెన్‌లో నిర్వహించారు. ఇందులో ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్‌ బాపూటరావులతో పాటు జడ్పీ చైర్మన్‌ జనార్దన్‌ రాథోడ్‌, మండల నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్‌, రాష్ట్ర కార్యదర్శి అరిగెల నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ ఎన్నికైన గ్రామ, పట్టణ, మండల కమిటీలు చురుగ్గా పని చేస్తూ పార్టీని బలోపేతం చేయాలని కోరారు. సమావేశంలో డెయిరీ చైర్మన్‌ లోక భూమారెడ్డి, మాజీ ఎంపీ గోడంనగేష్‌, రైతుబంధు జిల్లా అధ్యక్షుడు అడ్డిభోజారెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ మెట్టు ప్రహ్లాద్‌, గ్రంథాలయ చైర్మన్‌ రైతుమనోహార్‌ తదితరులు పాల్గొన్నారు.