నాటిన ప్రతిమొక్కనూ సంరక్షించాలి

ABN , First Publish Date - 2021-06-18T04:45:15+05:30 IST

నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించవాల్సిన బాధ్యత అధికారులపై ఉందని జడ్పీ సీఈవో రత్నమాల అన్నారు.

నాటిన ప్రతిమొక్కనూ సంరక్షించాలి
పాములవాడలో నర్సరీని పరిశీలిస్తున్న జడ్పీ సీఈవో

- జడ్పీ సీఈవో రత్నామాల    

సిర్పూర్‌(యు), జూన్‌ 17: నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించవాల్సిన బాధ్యత అధికారులపై ఉందని జడ్పీ సీఈవో రత్నమాల అన్నారు. గురువారం మండలం లోని పాములవాడలోని నర్సరీని పరిశీలించారు. అదే విధంగా మహగాంలో గల పల్లెప్రకృతి వనంలో ఆమె మొక్కలు నాటారు. అనంతరం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఉపాధిహామీ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లా డుతూ త్వరలో హరితహారం కింద మొక్కలు నాటాల్సి ఉందన్నారు. మొక్కలను సిద్ధం చేయాలన్నారు. గతంలో రోడ్లకు ఇరువైపులా నాటినమొక్కలు ఉన్నాయా లేదా చూడాలన్నారు. మొక్కలు లేనిచోట నాటలన్నారు. హరితంహారం మొక్కల పెంప కంపై నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్ర మంలో ఆడిషనల్‌ పిడీ కుటుంబరావు, ఎంపీడీవో మధుసూధన్‌, లింగాపూర్‌ జడ్పీటీసీ రక్కబాయి తదితరులు పాల్గొన్నారు.

హరితహారంను వందశాతం పూర్తిచేయాలి

లింగాపూర్‌: హరితహారం కార్యక్రమాన్ని వందశాతం పూర్తిచే యాలని జడ్పీ సీఈవో రత్నమాల అన్నారు. గురువారం ఆమె మండ లంలోని నర్సరీలను సందర్శిం చారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ వందశాతం హరితహారం తోపాటు పెండింగ్‌లో ఉన్న పల్లెప్రగతి పనులను పూర్తి చేయాలని అన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠినచర్యలు తీసుకుంటా మన్నారు. అనంతరం ఆమెను సిబ్బంది శాలువాలతో సన్మానిం చారు. డీఆర్డీవో కుటుంబరావు, ఎంపీడీవో ప్రసాద్‌, ఎంపీవో ఉమర్‌ షరీఫ్‌, జడ్పీటీసీ రకాబాయి పాల్గొన్నారు.

Updated Date - 2021-06-18T04:45:15+05:30 IST