Abn logo
Apr 10 2020 @ 05:10AM

ఇటలీలో ప్రతిరోజూ గండమే

నెలరోజులుగా తన భర్త ఇవానో ప్యూచీతో ఇటలీలోనే క్వారంటైన్‌ ఉన్నానని గాయని శ్వేతా పండిట్‌ తెలిపారు. ఆరు నెలలుగా శ్వేతా పండిట్‌ తన భర్త, కుటుంబ సభ్యులతో కలిసి ఇటలీలోనే ఉంటున్నారు.  ‘ఇంతకాలం మాతృభూమికి దూరంగా ఉండడం ఇదే మొదటిసారి. వీలైనంత త్వరగా ముంబై వచ్చేయాలనుంది’ అని ఆమె చెప్పారు. ‘‘రాఖీ పండుగ ముంబైలో జరుపుకోవాలని మార్చిలో ఇండియాకు తిరిగి వచ్చేయాలనుకున్నా. అయితే ఇటలీలో కరోనా విజృబించడంతో ఎటూ వెళ్లలేని పరిస్థితి. ఇక్కడి ప్రజలకు కరోనాతో పోరాటం రోజురోజుకీ కఠినంగా మారుతోంది. ఆసుపత్రులన్నీ కరోనా బాధితులతో నిండిపోయాయి. వెయిటింగ్‌ హాల్స్‌ ఐసీయులుగా మారిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితిని వైద్యులు ఎప్పుడూ చూసి ఉండరు. మరణాల సంఖ్య చూస్తుంటే కడుపు తరుక్కు పోతుంది. ప్రతిరోజూ గండంలాగే ఉంది. ఇలాంటి సమయంలో రిస్క్‌ తీసుకోవడం కరెక్ట్‌ కాదని నెల రోజులుగా మా కుటుంబం అంతా క్వారంటైన్‌లో ఉన్నాం. కొన్ని నెలల క్రితం చూసిన ఇటలీ ఇప్పుడు అలా లేదు. వీధులు నిర్మానుష్యంగా మారాయి. బెర్గామో, మిలన్‌ ప్రాంతాల్లో వందల సంఖ్యలో మరణించిన వారిని ఆర్మీ సైనికులు ఎలా తీసుకెళ్లార్లో కళ్లారా చూశాను. వారిని ఖననం చేయడానికి ఖాళీ స్థలం కూడా లేదు. భయభ్రాంతులకు గురవుతున్న ఇటలీ ప్రజలకు ఇక్కడి గాయనీగాయకులు కొందరు తమ పాటలతో ధైర్యానిస్తున్నారు’’ అని శ్వేతా పండిట్‌ తెలిపారు. 


Advertisement
Advertisement
Advertisement