Abn logo
Sep 26 2021 @ 00:52AM

ప్రతిఒక్కరూ ఉన్నతస్థాయికి ఎదగాలి

విద్యార్థులతో డీఐజీ కాంతిరాణాటాటా, ఎస్పీ డాక్టర్‌ ఫక్కీరప్ప


: డీఐజీ కాంతిరాణాటాటా,  ఎస్పీ డాక్టర్‌ ఫక్కీరప్ప

- 84మంది విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల అందజేత

అనంతపురం క్రైం, సెప్టెంబరు 25: క్రమశిక్షణ, పట్టుదలతో విద్యనభ్యసించి ప్రతి విద్యార్థి ఉన్నతస్థాయికి ఎదగాలని అనంతపు రం రేంజ్‌ డీఐజీ కాంతిరాణాటాటా, జిల్లా ఎస్పీ డాక్టర్‌ ఫక్కీరప్ప పి లుపునిచ్చారు.  పోలీసు సంక్షేమంలో భాగంగా స్థానిక పోలీసు పరేడ్‌ మైదానంలో శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించి 84మంది పోలీసు పిల్లలకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. అనంత రం వారిద్దరూ మాట్లాడుతూ ప్రతిరోజు 10 గంటలకు తక్కువ కాకుండా బాధ్యతగా చదివితే తప్పనిసరిగా ఉన్నత శిఖరాలను అధిరోహి స్తారని తెలిపారు. తల్లిదండ్రులు కూడా పిల్లల ఇష్టాలను తెలుసుకుని వారికిష్టమైన రంగం వైపు నడిపిస్తే ఉత్తమ భవిష్యత లభిస్తుందన్నారు. అనంతరం విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ. 20 వేలు విలు వ చేసే చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు నాగేంద్రుడు, రామ్మోహనరావు, రామకృష్ణప్రసాద్‌, హనుమంతు, సీసీఎస్‌ డీఎస్పీ మహబూబ్‌బాషా, ఏఓ శంకర్‌, వివిధ విభాగాల సూపరింటెండెంట్‌లు, జిల్లా పోలీసు అధికారుల అడహక్‌ కమిటీ సభ్యులు త్రిలోక్‌నాథ్‌, సుధాకర్‌రెడ్డి, హరినాథ్‌, శివప్రసాద్‌, శ్రీనివాసుల నాయు డు, తేజ్‌పాల్‌, రమణ పాల్గొన్నారు.