Advertisement
Advertisement
Abn logo
Advertisement

స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ బాధ్యత అందరిది

ఏఐటీయూసీ రాష్ట్ర నాయకుడు పడాల రమణ 

కూర్మన్నపాలెం, నవంబరు 28: ఉక్కు కర్మాగారం పరిరక్షణ బాధ్యత అందరిపై ఉందని ఏఐటీయూసీ రాష్ట్ర నాయకుడు పడాల రమణ అన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా  కూర్మన్నపాలెంలో ఉక్కు ఉద్యోగులు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు 290వ రోజు కొనసాగాయి. ఆదివారం ఈ దీక్షలలో ఎల్‌ఎంఎం, డబ్ల్యూఆర్‌ఎం-1, ఆర్‌ఎస్‌అండ్‌ఆర్‌ఎస్‌  విభాగ కార్మికులు కూర్చున్నారు. ఈ శిబిరంలో రమణ మాట్లాడుతూ తమ రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పూనుకుందని ఆరోపించారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ మాట్లాడుతూ ప్రభుత్వాలకు కనువిప్పు కలిగేలా కార్మికులు ఐకమత్యంతో ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్‌.రామారావు, గంధం వెంకటరావు, గంగవరం గోపి, వేములపాటి ప్రసాద్‌, కె.సత్యనారాయణ, మురళి, నాగబాబు, రాజు, శౌరి తదితరులు పాల్గొన్నారు.


Advertisement
Advertisement