Abn logo
Sep 26 2021 @ 00:48AM

ప్రతిఒక్కరూ కొవిడ్‌ నిబంధనలు పాటించాలి

 జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి  

అనంతపురం,సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): 

ప్రతిఒక్కరూ కొవిడ్‌ నిబంధనలు పాటించాలని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి శనివారం ఓ ప్రకటనలో కోరారు. ఆ మేరకు జిల్లాలో ఐదుగురి కంటే ఎ క్కువమంది గుమికూడదన్నారు. ఊరేగింపులు, రోడ్డు, వీధుల్లో బహిరంగ సభలకు అనుమతి లేదన్నారు. రాత్రి 11 నుంచి ఉదయం 6 గంటల వరకూ కర్ఫ్యూ అమలులో ఉంటుందన్నారు. ని బంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలతోపాటు సీజ్‌ చేస్తామన్నారు. దుకాణాలు, ఇతర ప్రదేశాల్లో కొ విడ్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌కు ఫొటోలు తీసి, పంపించాలన్నారు. అలాంటి దుకాణాలపై వారం రోజు ల వ్యవధిలో చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ తెలియజేశారు.