Abn logo
May 7 2021 @ 23:34PM

కొవిడ్‌ నియంత్రణలో ప్రతిఒక్కరూ భాగస్వామ్యం కావాలి

 ప్రతి గ్రామంలో ఫీవర్‌ సర్వే నిర్వహించండి

జడ్పీ సీఈవో లక్ష్మీపతి

పాలకొండ: కొవిడ్‌ మహమ్మారి నియంత్రణలో ప్రతి ఒక్కరూ భాగ స్వామ్యం కావాలని జడ్పీ సీఈవో లక్ష్మీపతి పిలుపునిచ్చారు. శుక్రవారం తంప టాపల్లిలో నిర్వహించిన స్వచ్ఛ సంకల్ప కార్యక్రమానికి ఆయన హాజరయ్యా రు. కొవిడ్‌పై వలంటీర్లు, సచివాలయ సిబ్బందితో చర్చించారు. గ్రామాల్లో ప్రతి ఇంటింటికీ వెళ్లి జ్వరాల సర్వే చేయాలని ఆదేశించారు. అవసరమైన వా రికి కొవిడ్‌ పరీక్షలు చేయించాలని తెలిపారు.  కార్యక్రమంలో ఎంపీడీవో  జె.ఆ నందరావు, డీఎల్‌పీవో జి.సత్యనారాయణ పాల్గొన్నారు. బూర్జ: విధి నిర్వహణలో సచివాలయ సిబ్బంది అలసత్వం ప్రదర్శించవద్దని జడ్పీ సీఈవో  లక్ష్మీపతి సూచించారు. మండలంలోని పెద్దపేట, సింగన్నపా లెంలో పరిశీలించారు. ఆయనతో పాటు ఎంపీడీవో సురేష్‌కుమార్‌ ఉన్నారు. ఇచ్ఛాపురం: కరోనా పాజటివ్‌ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో జ్వరాల సర్వే శతశాతం పూర్తిచేయాలని  కమీషనర్‌ లాలం రామలక్ష్మి కోరారు. శుక్రవారం మునిసిపాలిటీలో ఆరు వార్డులోని బ్రాహ్మణవీధిలో  జ్వరాల  సర్వేపై అవగాహన కల్పించారు. ఫ ప్రతి ఒక్కరూ కొవిడ్‌ నిబంధనలు పాటించి వ్యాపారాలు చేసుకోవాలని  మునిసిపల్‌ కమిషనర్‌ లాలం రామలక్ష్మి, పట్టణ ఎస్‌ఐ సత్యనారాయణ కోరారు. శుక్రవారం ఇచ్ఛాపురంలోని ఆర్‌అండ్‌బీ బంగ్లా ఆవరణలో ఏర్పాటుచేసిన కూరగాయల మార్కెట్‌ను పరిశీలించారు.  ఫఒడిశాతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే  ప్రయాణికులు ఉండే బస్సులు, కార్లు విడిచి పెట్టవద్దని సీఐ ఎం.వినోద్‌బాబు, తహసీల్దార్‌ మురళీమోహన్‌రావు తెలిపారు. ఇచ్ఛాపురం పరిధిలోగల పురుషోత్తపురం చెక్‌పోస్టు వద్ద తనిఖీచేశారు.  పాత బస్టాండ్‌ జంక్షన్‌లో టౌన్‌ ఎస్‌ఐ సత్యనారాయణ 12 గంటల తర్వాత వచ్చిన ద్విచక్రవాహనచోదకులకు కౌన్సెలింగ్‌ చేశారు. కార్యక్రమంలో డీటీ శ్రీహరి, ఆర్‌ఐలు యు.రాజారెడ్డి, సీతారామయ్య పాల్గొన్నారు. పొందూ రు: మండలంలోని యువత, దుకాణ నిర్వాహకులు కొవిడ్‌ నిబంధనలు పా టించేలా రెవెన్యూ అధికారులు, పోలీసులు చర్యలు తీసుకున్నారు. పొందూరు  కూరగాయల మార్కెట్‌, మహారాజా మార్కెట్‌లో భౌతికదూరం  పాటించేలా ఎస్‌ఐ ఆర్‌.దేవానంద్‌ పరిశీలించి అవగా హన కల్పించారు. పట్టణంలో పం చాయతీ అధికా రులు పారిశుధ్య  కార్యక్రమాలు నిర్వహించారు. ఆమదాలవలస: నిబంధనలు పాటిస్తేనే కొవిడ్‌ అరికట్టగలమని కమిషనర్‌ ఎం.రవిసుధాకర్‌ తెలిపారు.  శుక్రవారం పట్టణంలోని కంటైన్మెంట్‌ జోన్లలో పారిశుధ్యం, కర్ప్యూ అమలుపై సిబ్బందితో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురపాలక సంఘంలో ఇప్పటివరకు 501 కేసులు నమోదయ్యాయని, నలుగురు మృతిచెందారని తెలిపారు. పాలకొండ: ప్రతి ఒక్క రూ కొవిడ్‌నిబంధనలు పాటించాలని సీఐ శంకరరావు, ఎస్‌ఐ ప్రసాద్‌ సూచిం చారు.  నగర పంచాయతీ పరిధిలోని పలు చెక్‌పోస్టులు తనిఖీ చేశారు. ఫనగర పంచాయతీలోని ఎస్‌బీఐ, ఆంధ్రా  బ్యాంకులు కొవిడ్‌-19 ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కమిషనర్‌ రామా రావు సూచించారు. శుక్రవారం నగర పంచాయతీలోని బ్యాంకుల వద్ద రద్దీని పరిశీలించి మేనేజర్లతో మాటా ్లడారు. పాలకొండతో పాటు నియోజకవర్గంలో కర్ప్యూ నిబంధనలు పక్కాగా అమలు చేయాలని ఎమ్మెల్యే   కళావతి కోరారు. శుక్రవారం సాయంత్రం పాలకొండలోని ఏలాం జంక్షన్‌లో ఆర్డీవో టీవీఎస్‌జీ కుమార్‌తో కలిసి కర్ప్యూ అమలు తీరును పరిశీలించారు. గార: మండలంలో ఫీవర్‌ సర్వే పక్కాగా నిర్వహించాలని మండల ప్రత్యేక అధికారి గుత్తు రాజారావు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన శ్రీకూర్మం, అంపో లు గ్రామ సచివాలయాలు, శ్రీకూర్మం పీహెచ్‌సీని సందర్శించారు. మాస్కులు, శానిటైజర్లు, భౌతిక దూరం గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని సిబ్బం దికి సూచించారు. శ్రీకూర్మం సచివాలయ ఈవో జగన్నాథరావు పాల్గొన్నారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

కవిటి: కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతుం డడంతో   ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని  ఇన్‌చార్జి ఎంపీడీవో రామారావు కోరారు. శుక్ర వారం  డీజీపుట్టుగ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆరోగ్యశాఖ సిబ్బందితో మాట్లాడి పలు సూచనలు చేశారు. ఫ కవిటిలో పోలీసులు శుక్ర వారం పకడ్బందీగా కర్ఫ్యూ నిర్వహించారు. మధ్యా హ్నం 12 గంటల తర్వాత రోడ్డుపైకి వచ్చేవార్ని ఇళ్లకు పంపించారు.నిర్ణీత సమయం తర్వాత   తెరచి ఉన్న దుకాణాలు మూసివేయించారు.  అత్యవసర సమయాల్లో మినహా రోడ్లుపై తిరిగితే కేసులు నమోదుచేస్తామని ఎస్‌ఐ జి.అప్పారావు హెచ్చరించారు.  

 ముందుచూపులేకే కరోనా వ్యాప్తి

గుజరాతీపేట: ప్రభుత్వాలకు ముందుచూపు లేకపోవడం ప్రస్తుత కరోనా వ్యాప్తికి కారణమని డీడీసీ అధ్యక్షురాలు బొడ్డేపల్లి సత్యవతి విమర్శించారు.   శుక్రవారం పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌.. డీసీసీ అధ్యక్షులతో జూమ్‌ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా సత్యవతి మాట్లాడుతూ, కరోనాపై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ముందుగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించినప్పటికీ పట్టించుకోలేదన్నారు. దేశప్ర జలకు కాదని ఇతర దేశాలకు వ్యాక్సిన్‌ పంపడం వల్ల మనకు కొరత ఏర్పడిం దన్నారు. ప్రజలు ప్రభుత్వాలపై ఆధారపడకుండా,  ఇంటి వద్దనే రక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.  రణస్థలం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాల వల్లే కరోనా విజృంభిస్తోందని  ఎచ్చెర్ల నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి కె.సింహాద్రినాయుడు శుక్రవారం ఒక ప్రకటనలో  ఆరోపించారు. ఆక్సిజన్‌ అందక చాలా మంది  మృత్యవాత పడుతున్నారని తెలిపారు.  ఇప్పటికీ పూర్తి స్థాయిలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయలేని దౌర్భాగ్య పరిస్థితిలో ప్రభుత్వాలు ఉన్నాయని విమర్శించారు. కేంద్రంలో  రాష్ట్రపతి, రాష్ట్రంలో గవర్నర్‌ పాలన తీసుకొస్తే ప్రజలకు న్యాయం జరుగుతుందని తెలిపారు.

 నేడు  కొవాగ్జిన్‌ రెండో డోసు 

శ్రీకాకుళం: కొవాగ్జిన్‌ రెండో డోసుశనివారం ఇవ్వనున్నట్లు  డీఎంహెచ్‌వో కేసీ చంద్రనాయక్‌, జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి డాక్టర్‌ కె.అప్పారావు ఒక ప్రకటనలో తెలిపారు. 45 ఏళ్లు పైబడి, రెండో డోసు అర్హులైన వారికి, హెల్త్‌,  ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లకు ప్రాధాన్యంఇస్తామని పేర్కొన్నారు.  మార్చి 25 నుంచి ఏప్రిల్‌ 2వ తేదీ మధ్యలో మొదటి డోసు కోవ్యాక్సిన్‌ తీసుకున్నవారు మాత్రమే రెండో డోసుకు అర్హులని తెలిపారు.

ఉత్తమ సేవలందించండి 

కొవిడ్‌ బాధితులకు ఉత్తమ సేవలందించి ప్రజల హృదయాల్లో చిరస్థాయి గా నిలిచిపోవాలని మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. జెమ్స్‌ వైద్య కళా శాలలో శుక్రవారం కలెక్టర్‌ జె.నివాస్‌, వైద్యాధికారులు, సూపర్‌వైజర్లతో సమీ క్షించారు. గతంలో జిల్లా కొవిడ్‌ కేసుల నివారణలో రాష్ట్రం లో రోల్‌మోడల్‌గా నిలిచిందని చెప్పారు. జేసీ సుమిత్‌కుమార్‌, కొవిడ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ హేమంత్‌, సీఏవో రామ్మోహన్‌, డాక్టర్‌ సుధీర్‌   పాల్గొన్నారు. 

పోలీసులకు కొవిడ్‌ రెండో డోస్‌ టీకా

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి: జిల్లాలో పోలీసు సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు కొవిడ్‌ రెండో డోసు టీకా వేశారు.  శుక్రవారం జిల్లా పోలీసు కార్యా లయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ అమిత్‌బర్దర్‌ మాట్లాడుతూ, భౌతికదూరం, మాస్కులు ధరించడం మరిచిపోకూడదని చెప్పారు. డీఎస్పీలు మహేంద్ర, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 

 


Advertisement
Advertisement
Advertisement