Abn logo
May 23 2020 @ 19:49PM

‘నేను హీరోయిన్‌కి పనికిరానన్నారు.. కానీ ఇప్పుడు’

ముంబై: ‘నాలో హీరోయిన్‌కు ఉండాల్సిన కళ లేదన్నారు. సాధారణ గృహిణి పాత్రలకు నేను సరిపోనని రిజెక్ట్ చేశారు. కనీసం ఆడిషన్లు కూడా తీసుకునేవారు కాదు’ అంటూ బేతాళ్ వెబ్ సిరీస్ ప్రధాన పాత్ర ధారి అహానా కుమ్రా తెలిపారు. ఎంతో మంది డైరెక్టర్లు, ప్రోడ్యూసర్లను కలిశానని, వారిలో ఒక్కరు కూడా తనను అంగీకరించలేదని అహానా చెప్పుకొచ్చారు. అయితే వెబ్ సిరీస్‌ తనకు మంచి అవకాశం ఇచ్చిందని అన్నారు. ఎందరో ప్రతిభ గల నటులకు ఇప్పుడు వెబ్ సిరీస్‌లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని ఆమె చెప్పారు. బేతాళ్‌ సిరీస్‌లోని ప్రధాన పాత్రల్లో తనది ఒకటని, ఇందులో నటించడం ఎంతో సంతోషంగా ఉందని అహానా చెప్పారు. ప్రస్తుతం తనకు మంచి అవకాశాలు వస్తున్నాయని, భవిష్యత్తులో మరిన్ని వెబ్ సిరీస్‌లలో నటించేందుకు ఆసక్తిగా ఉన్నానని అహానా వివరించారు.

Advertisement
Advertisement
Advertisement