చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి

ABN , First Publish Date - 2021-10-23T04:41:05+05:30 IST

న్యాయసేవాధికారి సంస్థ, జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆదేశాల మేరకు మండల లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ జోగిపేట ఆధ్వర్యంలో శుక్రవారం చట్టాలపై జోగిపేట మున్సిఫ్‌ మేజిస్ర్టేట్‌ సంపత్‌ శల్లూరి అవగాహన కల్పించారు.

చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి
అవగాహన కల్పిస్తున్న సంపత్‌ శల్లూరి

జోగిపేట మున్సిప్‌ మేజిస్ట్రేట్‌ సంపత్‌శల్లూరి

అల్లాదుర్గం/శివ్వంపేట/నారాయణఖేడ్‌/జహీరాబాద్‌, అక్టోబరు 22 : న్యాయసేవాధికారి సంస్థ, జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆదేశాల మేరకు మండల లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ జోగిపేట ఆధ్వర్యంలో శుక్రవారం చట్టాలపై జోగిపేట మున్సిఫ్‌ మేజిస్ర్టేట్‌ సంపత్‌ శల్లూరి అవగాహన కల్పించారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవంలో భాగంగా అల్లాదుర్గం, పెద్దశంకరంపేట పరిధిలోని గ్రామ కార్యదర్శులకు, ఎస్‌హెచ్‌వోలకు అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో అల్లాదుర్గం ఎస్‌ఐ మోహన్‌రెడ్డి, గ్రామ కార్యదర్శులు పాల్గొన్నారు. శివ్వంపేట మండలంలోని నర్సాపూర్‌ లీగల్‌ సెల్‌ సర్వీసెస్‌ ఆధ్వర్యంలో చెన్నాపూర్‌, పెద్దగొట్టిముక్ల, చిన్నగొట్టిముక్ల, టిక్యాతండా, దేవమ్మతండా, సామ్యాతండా, మర్లగడ్డతండా తదితర గ్రామాల్లో చట్టాలపై అవగాహన కల్పించారు. నారాయణఖేడ్‌ మండలంలోని నిజాంపేటలో శనివారం ఉదయం 10.30 గంటలకు అవగాహనా సదస్సు నిర్వహిస్తున్నట్లు స్థానిక జూనియర్‌ సివిల్‌ జడ్జి ప్రియాంక సిరిసిల్లా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మైనర్లు బైక్‌ నడిపితే వారి తల్లిదండ్రులకు జైలు శిక్షణ పడుతుందని జహీరాబాద్‌ కోర్టు సీనియర్‌ సివిల్‌ జడ్జి దుర్గాప్రసాద్‌ అన్నారు. శుక్రవారం లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ ఆధ్వర్యంలో జహీరాబాద్‌లోని కృష్ణవేణి టాలెంట్‌ స్కూల్‌లో ఏర్పాటుచేసిన ‘న్యాయ సేవలు-అవగాహనలో పాల్గొని మాట్లాడారు. అడిషనల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సలోమాన్‌, న్యాయవాదులు, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-23T04:41:05+05:30 IST