Abn logo
Sep 26 2021 @ 00:23AM

ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలి : ఏడీజే

టీకా కార్యక్రమాన్ని పరిశీలిస్తున్న న్యాయమూర్తులు

హిందూపురం టౌన, సెప్టెంబరు 25: ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రతి వ్యక్తి కొవిడ్‌ టీకా వేయించుకోవాలని అదనపు జిల్లా జడ్జి స్వర్ణప్రసాద్‌ పేర్కొన్నారు. శనివారం కోర్టు ప్రాంగణంలో మెగా వ్యాక్సినేషన డ్రైవ్‌ చేపట్టారు. ఈ సందర్భంగా న్యాయవాదులు ప్రతి ఒక్కరూ కొవిడ్‌ టీకా వేయించుకోవాలన్నారు. మహమ్మారిని అరికట్టాలంటే టీకాతోనే సాధ్యమవుతుందన్నారు. అయితే కొంతమందిలో ఉన్న అపోహాలను వీడి టీకా వేయించుకుంటే థర్డ్‌వేవ్‌ను అడ్డుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా కోర్టుకు వచ్చిన కొంతమంది కక్షిదారులతోపాటు న్యాయవాదులు టీకాలు వేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తి హేమశ్రవంతి, బార్‌ అసోసియేషన అధ్యక్షుడు కార్యదర్శి శివశంకర్‌, న్యాయవాదులు రామచంద్రరెడ్డి, శ్రీనివాసరెడ్డి, సిద్దగంగప్ప, అశ్వత్థనారాయణరెడ్డి, సుదర్శన, శ్రీరాములు, క్రిష్ణమూర్తి, రకీబ్‌,  రత్నకుమార్‌, ఫణిభూషణ్‌, డాక్టర్‌ ఆనంద్‌బాబు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.