ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలి

ABN , First Publish Date - 2022-03-17T04:51:11+05:30 IST

ప్రతి ఒక్కరు కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకోవాలని ఎంపీపీ ఎల్కోటి లక్ష్మి పేర్కొన్నారు.

ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలి
ఊట్కూర్‌లో వ్యాక్సినేషన్‌ను ప్రారంభించిన ఎంపీపీ లక్ష్మి

- వ్యాక్సినేషన్‌ను ప్రారంభించిన ఎంపీపీ

ఊట్కూర్‌, మార్చి 16 : ప్రతి ఒక్కరు కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకోవాలని ఎంపీపీ ఎల్కోటి లక్ష్మి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని పీహెచ్‌సీలో బుఽధవారం 12 నుంచి 14 సంవత్సరాలలోపు చిన్నారులకు కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని జడ్పీటీసీ సభ్యుడు అశోక్‌గౌడ్‌, సర్పంచ్‌ సూర్యప్రకాష్‌రెడ్డితో కలిసి ఎంపీపీ ప్రారంభించారు. అదే విధంగా పులిమామిడి పీహెచ్‌సీలో సర్పంచ్‌ సూరయ్యగౌడ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు తప్పకుండా వ్యాక్సిన్‌ వేయించుకోవాలని సూచించారు. అంతకుముందు జాతీయ వ్యాక్సినేషన్‌ దినోత్సవం సందర్భంగా ఊట్కూర్‌, పులిమామిడి పీహెచ్‌సీల్లో ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రారంబించారు.  వైద్య సిబ్బంది సేవలను అభినందించారు. అనంతరం ఏఎన్‌ఎం, ఆశ కార్యకర్తలను శాలువాతో సన్మానించిరు. కార్యక్రమంలో డాక్టర్‌ నవీన్‌కుమార్‌రెడ్డి, డాక్టర్‌ నరేష్‌చంద్ర, ఎంపీహెచ్‌వో విజయ్‌కుమార్‌, సూపర్‌వైజర్‌ సురేష్‌, ఏఎన్‌ఎం శైలజ, కవిత, మహేశ్వరి, సుజాత, గోవిందమ్మ, చిట్టెమ్మ, అంబుబాయి, దేవికారాణి, మంజుల, లక్ష్మి పాల్గొన్నారు.

 నారాయణపేట రూరల్‌ : మండలంలోని కోటకొండ పీహెచ్‌సీలో బుధవారం 12 నుంచి 14 ఏళ్ళలోపు పిల్లలకు కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ను వైద్యాధికారి వెంకట్‌దాదన్‌, సర్పంచ్‌ విజయలక్ష్మీ ప్రారంభించారు. ఈ సందర్భంగా 88 మంది విద్యార్థులకు వ్యాక్సిన్‌ వేశారు.  జాతీయ వ్యాక్సినేషన్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని వ్యాక్సినేషన్‌లో ప్రతిభ కనబరిచిన ఏఎన్‌ఎం యశోద, ఆశ కార్యకర్తలు కల్పన, జయమ్మను సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీహెచ్‌వో అశోక్‌రాజ్‌, ప్రభావతమ్మ, నాగరాజు పాల్గొన్నారు.

Updated Date - 2022-03-17T04:51:11+05:30 IST