Abn logo
Sep 23 2021 @ 00:48AM

ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ తీసుకోవాలి

మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ సత్యప్రసాద్‌

రుద్రంగి సెప్టెంబరు 22: అర్హులైన ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్‌ తీసు కోవాలని అదనపు కలెక్టర్‌ సత్య ప్రసాద్‌ అన్నారు. రుద్రంగి, మానాలలో కొనసా గుతున్న వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని బుధ వారం మండల ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఎంపీపీ గంగం స్వరూప రాణి మహేష్‌, జడ్పీటీసీ గట్ల మీనయ్య, ఎంపీడీవో శంకర్‌, మండల వైద్యా ధికారి మసూద్‌, సర్పంచ్‌ తర్రె ప్రభలత మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు. 

గంభీరావుపేట: పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి ఒక్క రూ కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేసుకోవాలని స్థానిక ఎంపీపీ వంగ కరుణసురేందర్‌రెడ్డి సూచించారు. గంభీరావుపేట మండలం లింగన్నపేట, కొత్తపల్లి గ్రామాల్లో కొనసాగుతున్న ప్రత్యేక వ్యాక్సిన్‌ కేంద్రాలను బుధవారం పరిశీలించారు. వాక్సిన్‌పై గ్రామాల వారీగా ప్రజా ప్రతినిధులు అవగాహన కల్పించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌లో గంభీరావుపేట మండలాన్ని ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేయాలన్నారు. ఎంపీడీవో శ్రీనివాస్‌ ఉన్నారు. 

 ఇల్లంతకుంట : వ్యాక్సిన్‌తోనే కరోనాను కట్టడి చేయవచ్చని సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు చల్ల నారాయణ పేర్కొన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ వ్యాక్సిన్‌ వేశారు. అనంతారంలో మాట్లాడారు.  వైద్యాధికారులు సుభాషిణి, రామకృష్ణ, ఉపసర్పంచ్‌ తీగల శ్యాం తదితరులు  పాల్గొన్నారు.

చందుర్తి : ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ తీసుకోవాలని ఎంపీపీ బైరగొని లావణ్య-రమేష్‌ అన్నారు. మండలంలోని వివిధ గ్రామాల్లో బుధవారం ఇంటి ంటా వ్యాక్సినేషన్‌ నిర్వహించారు. ప్రతేక అధికారి ఎల్లయ్య, ఎంపీవో ప్రదీప్‌ పాల్గొన్నారు.