ప్రతిఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలి : ఎస్పీ

ABN , First Publish Date - 2021-02-25T05:23:52+05:30 IST

కొవిడ్‌ వ్యాక్సిన్‌పై ఎలాంటి అపోహలు వద్దని, ప్రతి ఒక్కరూ నిరభ్యంతరంగా వ్యాక్సిన్‌ వేయించుకోవాలని ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ తెలిపారు.

ప్రతిఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలి : ఎస్పీ
వ్యాక్సిన్‌ వేయించుకుంటున్న ఏఎస్పీ

కడప (క్రైం), ఫిబ్రవరి 24: కొవిడ్‌ వ్యాక్సిన్‌పై ఎలాంటి అపోహలు వద్దని, ప్రతి ఒక్కరూ నిరభ్యంతరంగా వ్యాక్సిన్‌ వేయించుకోవాలని ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ తెలిపారు. బుధవారం జిల్లాలో పోలీసులకు కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ఎస్పీ ప్రారంభించారు. పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో పనిచేస్తున్న పోలీసు సిబ్బంది కోసం నగరంలోని పోలీసు సంక్షేమ వైద్యశాల, ఉమేష్‌ చంద్ర స్మారక కల్యాణ మండపంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కొవిడ్‌ వ్యాక్సిన్‌పై చేసే అసత్య ప్రచారాలు నమ్మవద్దన్నారు. పోలీసు అధికారులు, సిబ్బంది తప్పక వ్యాక్సిన్‌ వేయించుకోవాలని తెలిపారు. జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన) ఎం.ఖాసింసాహెబ్‌ స్థానిక పోలీ సు సంక్షేమ వైద్యశాలలో టీకా వేయించుకున్నారు. జిల్లాలోని ఇతర పట్టణాలు, మండల కేంద్రాల్లో ఉన్న పోలీసుస్టేషన్‌లలో ఆయా సిబ్బంది సమీప పీహెచ్‌సీల్లో ఈ వ్యాక్సిన్‌ వేసుకునేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. కార్యక్రమంలో ఏఆర్‌ అదనపు ఎస్పీ రిషికేశవరెడ్డి, ఏఆర్‌ డీఎస్పీ రమణయ్య, పోలీసు సంక్షేమ వైద్యశాల వైద్యులు డాక్టర్‌ సమీరా, ఆర్‌ఐలు మహబూబ్‌బాషా, జార్జి, ఆర్‌ఎ్‌సఐలు పోతురాజు, వెంకటేశ్వర్లు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-25T05:23:52+05:30 IST