Abn logo
Sep 19 2021 @ 23:24PM

ప్రతి ఒక్కరూ కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకోవాలి

వ్యాక్సినేషన్‌ను పరిశీలిస్తున్న ఎంపీడీవో సత్యనారాయణగౌడ్‌

తుడుం దెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆత్రం శంకర్‌

సిర్పూర్‌(యూ):సెప్టెంబరు 19: ఆదివాసీలందరు కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించు కోవాలని జైనూర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆత్రం భగవంత్‌రావు, తుడుందెబ్బ జిల్లా ప్రధానకార్యదర్శి ఆత్రం శంకర్‌ కోరారు. ఆదివారం మండల కేంద్రంలో వారు విలేకరులతో మాట్లాడుతూ వ్యాక్సిన్‌ తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. ప్రభుత్వం ఇంటింటిని సందర్శించి వ్యాక్సిన్‌ వేస్తుందన్నారు.విద్యార్థి సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి కుడ్మెత విశ్వనాథ్‌రావు,సర్పంచులు మెస్రం భూవు, ఆర్క నాగోరావు, మడావి బోజ్జిరావు,సిడం సుబాష్‌, ఆడ వేంకటేష్‌ పాల్గొన్నారు.

దహెగాం: అర్హులందరూ కరోనా వ్యాక్సిన్‌ వేయించుకోవాలని ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్‌ అన్నారు. ఆదివారం బీబ్రా గ్రామంలో వ్యాక్సి నేషన్‌ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. సర్పంచ్‌ కృష్ణ, ఎంపీవో రాజేశ్వర్‌గౌడ్‌, ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

వ్యాక్సిన్‌పై గ్రామాల్లో అవగాహన..

సిర్పూర్‌(యూ): మండలంలోని పలు గ్రామలల్లో ఆదివారం అధికారులు ప్రజలకు కొవిడ్‌ వ్యాక్సిన్‌పై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా భూర్నూర్‌లో డీపీవో శ్రీకాంత్‌ కొవిడ్‌ వ్యాక్సిన్‌ ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ తోడసం భాగ్యలక్ష్మి వ్యాక్సిన్‌ తీసుకున్నారు.