Abn logo
Jun 12 2021 @ 00:55AM

కరోనాపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి

- కొవిడ్‌ బాధితులకు బార్‌ అసోసియేషన్‌ ఆర్థిక సహాయం 

- 6వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి భారతలక్ష్మి

కోల్‌సిటీటౌన్‌, జూన్‌ 11: కరోనా మహమ్మారి పట్ల ప్రజలు అప్రమ్తంగా ఉండాలని 6వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి జీవీఎన్‌ భారత లక్ష్మి అన్నారు. మండల న్యాయ సేవాధికార సంస్థ, బార్‌ అసోసియే షన్‌ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం గోదావరిఖని లోని 6వ అదనపు జిల్లా కోర్టు ఆవరణలో కొవిడ్‌ బా ధితులైన న్యాయవాదులకు, కరోనా మృతుల కుటుం బాలకు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్ర మానికి న్యాయమూర్తి భారతలక్ష్మి ముఖ్యఅతిథిగా హా జరై మాట్లాడారు. ప్రతిఒక్కరు శానిటైజర్‌ను ఉపయో గించాలని, భౌతికదూరం పాటించాలని, మాస్క్‌ తప్ప నిసరిగా ధరించాలని సూచించారు. అప్పుడే మనతో పాటు ప్రతిఒక్కరి ప్రాణాలను కాపాడుకున్న వారమ వుతామన్నారు. అనంతరం కొవిడ్‌ బాధితులకు, వారి కుటుంబాలకు న్యాయమూర్తి భారతలక్ష్మి, కార్పొరేషన్‌ కమిషనర్‌ ఉదయ్‌కుమార్‌ చేతుల మీదుగా ఆర్థిక స హాయం అందజేశారు. అంతకు ముందు మరణించిన న్యాయవాదుల ఆత్మకు శాంతిచేకూరాలని మౌనం పా టించారు. కార్యక్రమంలో గోదావరిఖని ప్రిన్సిపల్‌ జూ నియర్‌ సివిల్‌ జడ్జి పర్వతపు రవి, మున్సిఫ్‌ కోర్టు మే జిస్ర్టేట్‌లు టీఎస్‌పీ భార్గవి, జీఎస్‌ఎల్‌ ప్రియాంక, బా ర్‌అసోసియేషన్‌ అధ్యక్షుడు బల్మూరి అమరేందర్‌రా వు, ప్రధానకార్యదర్శి జువాజీ శ్రీనివాస్‌, కార్యవర్గ స భ్యులు పాత అశోక్‌, మహేశ్వరం రాగిణి, పద్మజ, ప్ర దీప్‌, ఉమర్‌, ముచ్చకుర్తి కుమార్‌, సీనియర్‌ జూని యర్‌ న్యాయవాదులు శైలజ, గోపాల్‌రెడ్డి, సతీష్‌, రా ము, శంకర్‌, రామటెంకి శ్రీనివాస్‌, ప్రియాంక తదిత రులు పాల్గొన్నారు.

Advertisement