గ్రామాభివృద్ధికి అందరూ సహకరించాలి

ABN , First Publish Date - 2022-06-06T06:09:45+05:30 IST

గ్రామాల అభివృద్దిలో ప్రతి ఒక్కరు సహాకరించాలని జిల్లా కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ అన్నారు. ఆదివారం గిరిజన గ్రామయిన గిరిగావ్‌లో పల్లెప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంలో ప్రతీఒక్కరు పాల్గొనాలని అన్నారు.

గ్రామాభివృద్ధికి అందరూ సహకరించాలి
ఘన్‌పూర్‌లో పల్లెప్రగతి పనులను పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్‌ రిజ్వాన్‌బాషా

పల్లె ప్రగతి కార్యక్రమంలో కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌

తాంసి, జూన్‌ 5: గ్రామాల అభివృద్దిలో ప్రతి ఒక్కరు సహాకరించాలని జిల్లా కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ అన్నారు. ఆదివారం గిరిజన గ్రామయిన గిరిగావ్‌లో పల్లెప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంలో ప్రతీఒక్కరు పాల్గొనాలని అన్నారు. ప్రల్లెప్రగతి కార్యక్రమం ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ప్రతి గ్రామంలో కూడ ఆట స్థలాల ఏర్పాటు కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోందని, ప్రతి ఒక్కరు గ్రామాల అభివృద్దిలో యుత పాత్ర  కీలకమ న్న విషయాన్ని గమనించి సహకరించాలన్నారు. ఇందులో జడ్పిటీసీ తాటిపల్లి రాజు, ఎంపీడీవో భూమయ్య, సర్పంచ్‌ యశవంత్‌, భరత్‌, సూపరిండెంట్‌ రవీందర్‌, ఎంపీడీవో సుదీర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఉట్నూర్‌: ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లెప్రగతి కార్యక్రమాల ద్వారా  ప్రజ ల సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని స్థానిక సంస్థల అద నపు కలెక్టర్‌ రిజ్వాన్‌బాషా అన్నారు. ఆదివారం మండలంలోని ఘన్‌పూర్‌, హ స్నాపూర్‌ గ్రామాలలో నిర్వహిస్తున్న పల్లెప్రగతి కార్యక్రమాలను పరిశీలించారు. ఘన్‌పూర్‌ గ్రామంలో ఎంపీపీ పంద్రజైవంత్‌రావుతో కలిసి పర్యటించారు. గ్రామ లో చేపడుతున్న పారిశుధ్య కార్యక్రమాలను పరిశీలించి పల్లెప్రకృతి వనాన్ని పరిశీలించారు. ఇందులో డీఎల్‌పీవో భిక్షపతి గౌడ్‌, ఎంపీడీవో తిరుమల, ఈజీఎస్‌ ఎపీవో రజికాంత్‌, ఎంపీవో మహేష్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.  

ఇంద్రవెల్లి: గ్రామాభివృద్దితో పాటు గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలంటే అందరి సహకారంతోనే సాధ్యమని డీఎప్పీవో బిక్షపతి గౌడ్‌ అన్నారు. ఆదివారం మండలకేంద్రంలో జరుగుతున్న పల్లెప్రగతి పనులను పరిశీలించారు. ఇందులో మండల ఎంపీవో సంతోష్‌ , ఈవో సంజీవ్‌రావు, పంచాయతీ సిబ్బంది, ఇద్రీష్‌, గంగారాం, తదితరులు పాల్గొన్నారు. అలాగే,  ప్రతి ఒక్కరు పరిసరాలు పరిశుభ్రత పాటించాలని మండల ఎంపీవో సంతోష్‌సూచించారు. పల్లెప్రతి కార్యక్రమం లో భాగంగా మేజర్‌ గ్రామ పంచాయతీ పరిధిలోని కాలనీలను సర్పంచ్‌ కోరేంగ గాంధారిసుంకట్‌రావుతో కలిసి సందర్శించారు.  

ఆదిలాబాద్‌ టౌన్‌: రేపటి తరం భవిష్యత్‌ కోసం పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యతలో ఇప్పటి నుంచే ప్రతీఒక్కరు సంకల్పితలు కావాలని ఎమ్మెల్యే జోగురామన్న కోరారు. ఆదిలాబాద్‌ మున్సిపల్‌ పరిధిలోని వార్డు నెంబర్‌ 14 సంజయ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్యే జోగురామన్న ముఖ్య అతిథిగా పాల్గొని పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని మున్సిపల్‌ అధికారులు కాలనీ వాసులతో కలిసి ర్యాలీని ప్రారంభించారు. అలాగే,  పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా శాంతినగర్‌లో మున్సిపల్‌ చైర్మన్‌ జోగుప్రేమేందర్‌ సమస్యల పరిష్కారానికి కాలినడకన సమస్యలను తెలుసుకున్నారు.   

నార్నూర్‌: గ్రామాల్లో ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఐదోవిడుత పల్లెప్రగతి పనులు కొనసాగుతున్నాయి. ఆదివారం మండలంలోని ఖడ్కి, మహాగాం, మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీలలో పలు పారిశుధ్య పనులు చేపట్టారు. 

బేల: పల్లె ప్రగతి కార్యక్రమంతో పాటు తన పుట్టిన రోజు సందర్భంగా మండలంలోని దహేగావ్‌ గ్రామంలో ఎంపీపీ వనితగంభీర్‌ఠాక్రె  మొక్కలు నాటారు. ఎంపీడీవో రవీందర్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-06T06:09:45+05:30 IST