ప్రతీ ఒక్కరు దైవభక్తి అలవర్చుకోవాలి

ABN , First Publish Date - 2022-02-09T05:40:45+05:30 IST

ప్రతీ ఒక్కరు దైవభక్తిని అలవర్చుకోవాలని జడ్చర్ల మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ దోరేపల్లి లక్ష్మి అన్నారు.

ప్రతీ ఒక్కరు దైవభక్తి అలవర్చుకోవాలి
పట్టు వస్త్రాలు తీసుకొస్తున్న జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్‌

- గంగాపురం దైవ సన్నిధిలో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ లక్ష్మి 


జడ్చర్ల, ఫిబ్రవరి 8 : ప్రతీ ఒక్కరు దైవభక్తిని అలవర్చుకోవాలని జడ్చర్ల మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ దోరేపల్లి లక్ష్మి అన్నారు. మంగళవారం రథసప్తమి సందర్భంగా మండలంలోని గంగాపురం శ్రీలక్ష్మీచెన్నకేశవ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఈఓ శ్రీనివాసరాజు, కౌన్సిలర్లు, పూజారులు పాల్గొన్నారు. 


ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో


బాదేపల్లి  : ఆర్యవైశ్య మహాసభ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రథసప్తమి పర్వదినం సందర్భంగా మంగళవారం జిల్లాలోని జడ్చర్ల, నవా బ్‌పేట, దేవరకద్రలో శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయాలను సంద ర్శించి అమ్మవారికి పట్టు వస్త్రాలు అందజేసి, ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు పాలాది రామోహన్‌, జడ్చర్ల మునిసిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ పాలాది సారిక, సంఘం మాజీ అధ్య క్షుడు సోమిశెట్టి సాయికిషోర్‌, ప్రధాన కార్యదర్శి మేడిశెట్టి రామకృష్ణ, కోశా ధికారి ఆరీర్‌ అశోక్‌, నాయకులు ప్రమేద్‌ కుమార్‌, హరికాంత్‌, అమరవాది ప్రభు, మంజుల రాణి, శ్రీలత, రాధిక, వెంకటేష్‌, చక్రధర్‌, వేణుగోపాల్‌, రాజనర్సింహ, చందు, కన్నయ్య, ఏన్న సత్యనారాయణ, కృష్ణ పాల్గొన్నారు. 


జాతరకు ప్రత్యేక బస్సులు 


మహబూబ్‌నగర్‌ టౌన్‌ : గంగాపూర్‌ లక్ష్మీచెన్నకేశవ స్వామి జాతరను పురస్కరించుకొని మంగళవారం మహబూబ్‌నగర్‌ నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులను డీవీఎం మాధవరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజు 10 ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నామని, అవసరమైతే ఇంకా బస్సులను అదనంగా నడిపిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రీజినల్‌ కార్యాలయం ఏ.ఓ నర్సయ్యతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.వివేచన వ్యాస సంపుటి గ్రంథావిష్కరణ చేస్తున్న ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, పీయూ వీసీ ప్రొఫెసర్‌ ఎల్‌.బి. లక్ష్మీకాంత్‌ రాథోడ్‌, అధికారులు



Updated Date - 2022-02-09T05:40:45+05:30 IST