ప్రతిఒక్కరూ భౌతికదూరం పాటించాలి

ABN , First Publish Date - 2020-05-21T10:26:02+05:30 IST

ప్రతిఒక్కరూ భౌతిక దూరం..పరిశుభ్రత పాటించాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి తెలిపారు.

ప్రతిఒక్కరూ భౌతికదూరం పాటించాలి

నిర్మల్‌ పట్టణంలో మంత్రి  ఇంద్రకరణ్‌రెడ్డి ఆకస్మిక పర్యటన 

దుకాణాలు, ఆర్టీసీ బస్టాండ్‌లో కలియతిరిగిన అల్లోల 


నిర్మల్‌, మే 20(ఆంధ్రజ్యోతి): ప్రతిఒక్కరూ భౌతిక దూరం..పరిశుభ్రత పాటించాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి తెలిపారు. బుధవారం జిల్లాకేంద్రంలోని పలు దుకాణాలను ఆయన పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. దుకాణాల వద్ద ప్రజలు భౌతిక దూరాన్ని పాటించేలా చూడాలని, మాస్కులు ఉన్నవారినే షాపుల్లోకి అనుమతించాలని సూచించారు.


దూరప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులకు టిఫిన్‌, భోజన సదుపాయం కల్పించేలా బస్టాండ్‌లోని క్యాంటీన్లను, బేకరీలను తెరిచే విధంగా చూడాలని డీఎంను మంత్రి ఆ దేశించారు. అనంతరం ఎమ్మెల్యే రేఖా శ్యాంనాయక్‌తో కలిసి బస్టాం డ్‌ నుంచి మంచిర్యాల చౌరస్తా వరకు ఖానాపూర్‌కు వెళ్లే బస్సులో ప్రయాణించి, కాసేపు ప్రయాణికులతో ముచ్చటించారు. కొందరు ప్రయాణికులకు మంత్రి స్వయంగా టిక్కెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ గండ్రత్‌ ఈశ్వర్‌, జిల్లా గ్రంథాల య చైర్మన్‌ ఎర్రవోతు రాజేందర్‌, ఎఫ్‌ఎస్సీఎస్‌ చైర్మన్‌ ధర్మాజీ రా జేందర్‌, టీఆర్‌ఎస్‌ పట్టణ నాయకులు మారుగొండ రాము, కౌన్సిల ర్లు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. 


లాక్‌ డౌన్‌ పరిశీలించిన మంత్రి

నిర్మల్‌ పట్టణంలో లాక్‌డౌన్‌ను బుధవారం మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పరిశీలించారు. ప్రభుత్వం సడలింపు ఏవిధంగా అమలవుతున్నాయో ఆయన అధికారులతో కలిసి పర్యవేక్షించారు. పాత బస్టాండ్‌ ప్రాంతంలో వర్తకులు, చిరువ్యాపారుల ను కలిసి ప్రజలు నిబంధనలు పాటించేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. అలాగే, అధికారులు కరోనా ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని, ఈనెల 31వరకు లాక్‌డౌన్‌ పటిష్టంగా అమలు చేయాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన సడలింపులు సద్వినియోగపర్చుకోవాలని జాగ్రత్తలు పాటించాలని స్పష్టం చేశారు. ఇందులో మున్సిపల్‌ చైర్మన్‌ ఈశ్వర్‌, వార్డు సభ్యులు ఉన్నారు.


Updated Date - 2020-05-21T10:26:02+05:30 IST