ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గంలో నడవాలి

ABN , First Publish Date - 2020-12-03T05:37:20+05:30 IST

ఉరుకులు, పరుగుల జీవన విధానంలో ఒత్తిడికి గురవుతున్న ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గంలో నడవాల్సిన అవసరం ఉందని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి భవేష్‌మిశ్రా అన్నారు. బుధవారం మండలంలోని బిక్కుతండా గ్రామంలో 75వ వజ్రోత్సవము కార్తీక మాసం మహాకళా కార్యక్రమం ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై హన్మాన్‌ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గంలో నడవాలి
కార్యక్రమంలో మాట్లాడుతున్న ఐటీడీఏ పీవో భవేష్‌మిశ్రా

ఇంద్రవెల్లి, డిసెంబరు 2: ఉరుకులు, పరుగుల జీవన విధానంలో ఒత్తిడికి గురవుతున్న ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గంలో నడవాల్సిన అవసరం ఉందని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి భవేష్‌మిశ్రా అన్నారు. బుధవారం మండలంలోని బిక్కుతండా గ్రామంలో 75వ వజ్రోత్సవము కార్తీక మాసం మహాకళా కార్యక్రమం ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై హన్మాన్‌ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఐటీడీఏ పీవో మాట్లాడుతూ మన సంస్కృతీ సంప్రదాయాలను భావి తరాలకు అందించే బాధ్యత మనందరిపై ఉందన్నారు. నెల రోజులుగా కొనసాగుతున్న కార్తీక మాసం ముగింపు సందర్భంగా దహిహండి కార్యక్రమాన్ని నిర్వహించి దహిహండిని కొట్టి భక్తులకు మహాప్రసాదాన్ని పంచారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ మాస్కులు దరించి వందలాది మంది భక్తులు పాల్గొని గంటావార్‌కేర్బా మహరాజ్‌ ప్రవచనాలను ఆలకించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ ఆడే విజయ, ఆడే తుకారాం మహారాజ్‌, రాథోడ్‌ పర్శురాంనాయక్‌, ఆడే రామేశ్వర్‌, రాథోడ్‌ పుల్లచంద్‌, ఉపసర్పంచ్‌ ఆడే దత్తారాం తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2020-12-03T05:37:20+05:30 IST