అర్హులైన ప్రతి ఒక్కరూ కొవిడ్‌ టీకా వేసుకోవాలి

ABN , First Publish Date - 2021-04-09T07:06:05+05:30 IST

జిల్లాలో కరోనాకేసులు రోజురోజుకూ పెరుగు తున్నందున 45 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరూ సమీప ప్రభుత్వ ఆసు పత్రులలో కోవిడ్‌టీకా వేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ అన్నా రు.

అర్హులైన ప్రతి ఒక్కరూ కొవిడ్‌ టీకా వేసుకోవాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ

నిర్మల్‌ టౌన్‌, ఏప్రిల్‌ 8 : జిల్లాలో కరోనాకేసులు రోజురోజుకూ పెరుగు తున్నందున 45 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరూ సమీప ప్రభుత్వ ఆసు పత్రులలో కోవిడ్‌టీకా వేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ అన్నా రు. గురువారం కలెక్టర్‌ సమావేశ మందిరంలో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై వివిధ వర్గాల వారితో నిర్వహించిన అవగాహనసదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ కరోనా నుంచి రక్షణ 100 శాతం టీకాతోనే సాధ్యమని, అర్హులైన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ తీసుకోవాలన్నారు. పట్ట ణ, గ్రామీణ ప్రాంతాలలో 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఈ నెల చివరి నాటికి, మూడు నెలల్లో అందరికీ వ్యాక్సిన్‌ వేసేలా చర్యలు తీసుకుం టున్నామన్నారు. శుభకార్యాలు, పండగలలో కోవిడ్‌ నిబంధనలను అందరూ పా టించాలని, భౌతికదూరం, మాస్క్‌లు ధరించాలన్నారు. ప్రజల్లో టీకాలపై అపో హలు తొలగించడానికి వివిధ రంగాల వారు అగాహన కలిగించాలన్నారు. వృద్ధులు, వికలాంగులు, మహిళా సంఘాలు, మీసేవ ఆపరేటర్లు, నాయీ బ్రాహ్మణ, ఆటో యూనియన్‌, తదితర సంఘాల వారికి ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు హేమంత్‌ బోర్కడే, రాంబాబు, మున్సిపల్‌ కమిషనర్‌ బాలకృష్ణ, వివిధ సంఘాల సభ్యులు, వైద్యఅధికారులు, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-04-09T07:06:05+05:30 IST